janampulse
Breaking News

పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ

మెసేజ్ ఓరియెంటెడ్  ఫీల్ గుడ్ లవ్ & ఫ్యామిలీ ఏంటర్ టైనర్ “పటారు పాళెం ప్రేమకథ”‘ రివ్యూ

హీరో -శ్రీమానస్, హీరోయిన్ -సమ్మోహన,దీన ఆశ, చరణ్ కోరుకొండ, వినయ్ వాసిరెడ్డి,తదితరులు

సమర్పణ : యస్.యస్.రెడ్డి
బ్యానర్ : జె.యస్.ఫిల్మ్స్
నిర్మాతలు : వి.లతారెడ్డి, వి.సౌజన్య దొరైరాజు, బి.ఆర్.బాలు, కె.రామకృష్ణ ప్రసాద్
డైరెక్టర్ -ఉపాటి దోరయి రాజు
మ్యూజిక్ డైరెక్టర్ -బాలు డేక్
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ -రామ్ ముల్నిటీ

యస్.యస్.రెడ్డి సమర్పణలో జె.యస్.ఫిల్మ్స్ పతాకంపై శ్రీ మానస్, సమ్మోహన జంటగా ఉపాటి దోరయి రాజు ద‌ర్శ‌క‌త్వం లో వి.లతారెడ్డి, వి.సౌజన్య దొరైరాజు,బి.ఆర్.బాలు,కె.రామకృష్ణ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `పటారు పాళెం ప్రేమకథ’ ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్ కి ప్రేక్షకులనుండి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ఫీల్ గుడ్ లవ్ & ఫ్యామిలీ ఏంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఈ నెల 4 న గ్రాండ్ గా థియేటర్స్‌లో విడుదల అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
పటారు పాళెం లో వుండే గ్రామ ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి. ప్రాణం కంటే పరువే ముఖ్యమని బతుకుతుంటాడు. రాఘవరెడ్డి కి ఎంపీ సపోర్ట్ మెండుగా ఉంటుంది. తన సపోర్ట్ తో సర్పంచ్ నుంచి ఎం.ఎల్.ఏ కావాలని ప్రయత్నిస్తుంటారు. నా కూతురుని ఒక దళితుడు ప్రేమించాడని ఎంపీ వచ్చి రాఘవరెడ్డికి చెపితే ప్రేమించిన వాణ్ణి తీసుకువచ్చి..20 సంవత్సరాలుగా పెంచిన మా కుతుర్లను మీలాంటి దళితుడికి అప్పజెప్పాడానికా అని ఎంపీ ఎదుటే రాఘవరెడ్డి ఆ అబ్బాయిని చంపేస్తాడు.ఆ ఎంపీ వెళ్తూ వెళ్తూ నీకూ.. ఒక కూతురు ఉంది జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్తాడు. అయితే రాఘవరెడ్డి కూతురు స్వాతి(సమ్మోహన),ను దళిత  కుటుంబానికి చెందిన రైతు కొడుకు మురళి (శ్రీమానస్) స్వాతిని  చిన్నప్పటి  నుండి ఇష్టపడు తుంటాడు..ఆ  గ్రామంలో జరిగిన పోటీలలో గెలుపొందిన వారికి బైక్ బహుమతి ఇస్తామని ప్రకటిస్తారు. ఆ పోటీలో మురళి విజయం సాధించడంతో సర్పంచ్ రాఘవరెడ్డి తనకుతూరు స్వాతి చేతులమీదుగా బైక్ గిఫ్ట్ ఇప్పిస్తాడు. అలా తనపై ఇంకా ఎక్కువ ప్రేమను పెంచుకుంటాడు. ఆ తరువాత మురళి చదువు కొనే కాలేజ్ లోనే స్వాతి జాయినవుతుంది.అలా  కాలేజ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తో స్వాతి, మురళిని ఇష్టపడుతుంది.వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని రాఘవరెడ్డి కి తెలియడంతో స్వాతి,మురళి లు పట్నం కు పారిపోతారు.వీరిద్దరూ పట్నంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఎంపీ సపోర్ట్ తో  సిటీ లో వెతుకుతున్న రాఘవ రెడ్డి మనుషులకు వీరిద్దరూ దొరికారా.ఏడు సంవత్సరాల తరువాత వీరు రాఘవరెడ్డి మనుషులకు స్వాతి,మురళి లు దొరికితే వారిద్దరి జీవితంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

నటీనటుల పనితీరు
హీరోగా శ్రీమానస్ బాగానే చేశాడు, మురళి క్యారెక్టర్ లో చదువులో , ఆటలో రాణిస్తూ.. సరదాగా, ఛలాకీ కుర్రాడిగా, ప్రేమికుడిగా, బాధ్యత గల కుర్రాడిలా చక్కగా నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ గా నటించిన  సమ్మోహన .మతాలు కాదు మనుషులు, మనిషిలో వుండే గుణం ముఖ్యం అని తండ్రిని ఎదిరించే స్వాతి క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. హీరో పక్కన  నటించిన ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రెసిడెంట్ గా రాఘవ క్యారెక్టర్ లో హీరోయిన్ తండ్రి గా చాలా చక్కగా నటించాడు.ప్రాణం ముఖ్యమా..పరువు ముఖ్యమా.. అంటే పరువే.. ముఖ్యం అనే డైలాగ్ తో ఒక ఆడపిల్ల తండ్రిగా సహజమైన క్యారెక్టర్ లో నటించాడు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఇదొక లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం.దర్శకుడు ఉపాటి దోరయి రాజు
కుల మతాలు కాదు ముఖ్యం మనుషులు ముఖ్యం అంటూ 
మంచి మెసేజ్ ఇస్తూ లవ్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకుని ఎక్కడా వల్గారిటీకి తావులేకుండా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. అలాగే ఈ సినిమా ని డైరెక్టర్ తన భుజాలు మీద మోసాడు అని చెప్పాలి, చిన్న బడ్జెట్ లో తనకు వున్న వనరులు ని చాలా చక్కగా ఉపయోగించుకొని మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాడు.కాలేజ్‌లో హీరో, హీరోయిన్ల పై వచ్చే సన్నివేశాలు బాగున్నాయిఊరు పెద్ద ప్రెసిడెంట్ ప్రభాకర్ మనుషుల మధ్య జరిగే ఊరిలో గొడవలు, సెకండాఫ్ లో హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే లవ్,ఏమోషన్ సీన్స్ ఇవన్నీ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ మలిచాయి.బాలు డేక్ సంగీతమే సినిమాకి బలం. పాటలు చాలా బాగున్నాయి. ఆర్‌ఆర్‌ సైతం ఆకట్టు కుంటుంది. యాడున్నావ్.. యాడున్నావ్ ఇన్నాళ్లు నన్నొదలి యాడున్నావ్, ఆడియన్స్ ను ఉర్రూతలుగించే మళ్లీ మళ్లీ ఒచ్చిపోరాదే.. ముద్దిచ్చి.. పోరాధే.., ఎమోషనల్ సాంగ్ నువ్వేనా..ప్రాణం..నువ్వే నా ధ్యానం..నువ్వే..నా శ్వాస అనే సాంగ్స్ అన్ని సిచువేషన్ తగ్గట్టు  సాంగ్స్ ఉన్నాయి .సల్మాన్ ఖాన్,షారూఫ్ ఖాన్ సినిమాలకు పనిచేసిన రామ్ ముల్నిటీ కెమెరా వర్క్ బాగుంది.తెలుగులో తను చేస్తున్న మొదటి సినిమా ఇది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. ఎడిటింగ్  క్లాసీగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల స్థాయిలో  వి.లతారెడ్డి, వి.సౌజన్య దొరైరాజు, బి.ఆర్.బాలు, కె.రామకృష్ణ ప్రసాద్ లు ఈ సినిమాను రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారని చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా `పటారు పాళెం ప్రేమకథ’ ఈ చూసిన వారందరికీ తప్పక నచ్చుతుంది.
రేటింగ్ :3.5/5

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.