janampulse
Breaking News

కోడెల మరణంతో బాబు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు 10 ప్రశ్నలు

kodela-death

కోడెల శివప్రసాద్ మరణంతో ఒక్కసారిగా తెలుగురాష్ట్రాల్లో విషాదం అలముకుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వెను వెంటనే కోడెల హత్యకు కారణం వైసీపీ అని విమర్శలు ఆరోపణలు చేసింది. గతంలో చంద్రబాబు శవరాజకీయాలు అనేకం చేశారు ఇప్పుడు కూడా మొదలు పెట్టారా అని వైసీపీ , సాధారణ జనం ఆలోచించే లోపు, తీవ్రమైన ఆరోపణలతో తెలుగుదేశం నాయకులు రెడీ అయిపోయారు. అయితే ఈ సమయంలోనే పలు విమర్శలు ఆరోపణలు వైసీపీ పై కాకుండా టీడీపీ పై వస్తున్నాయి. చంద్రబాబు చేసిన అవమానాలు ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు.

10 రోజుల నుంచి కోడెల కోరుతున్నా, అసలు చంద్రబాబు కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదా? ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపాలి అని పక్కా ప్లాన్ వేశారట, ప్రజలు దీనిపై చర్చించుకుంటున్నారు, మంత్రులు వైసీపీ నాయకులు కూడా ఇవే చెబుతున్నారు.

1.. చంద్రబాబు 2014-2019 లో రాజకీయంగా అనేక ప్లాన్లు వేశారు, ఆ ప్లాన్లు అమలు చేయాలి అన్నా ఫిరాయింపులు ప్రొత్సహించాలి అన్నా కచ్చితంగా స్పీకర్ హస్తం ఉండాలి .. తాను చేయను అంటే కుదరదు, ఎందుకు అంటే బాబు ఇచ్చిన పదవి కాబట్టి దీంతో బాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా చేసినా, స్పీకర్ గా ఏమీ చేయలేని పరిస్దితికి కోడెల వచ్చారు, అలా అంత సాయం బాబుకు చేసినా నేడు మాత్రం కోడెలకు సమస్యలు వస్తే బాబు కోడెలను పక్కన పెట్టారు.

2.. ఇక్కడ మరో విషయం కోడెలపై కేసులు జగన్ వారి కుటుంబం, విజయసాయిరెడ్డి వారి కుటుంబం పెట్టలేదు.. అందరూ కూడా కోడెల బాధితులం అని వచ్చిన వారే, అవన్నీ కూడా నిరూపితం అయినవే దీనికి టీడీపీ సమాధానం లేదు.

3..కోడెలపై వస్తున్న విమర్శలు ఆరోపణలు అభియోగాల వల్ల తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అవుతుందని కోడెలను చంద్రబాబు కొద్దిరోజులుగా పక్కన పెట్టారట. ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అని తెలుస్తోంది..అలాగే పార్టీలో ఇన్వాల్వెమెంట్ చేయనివ్వడం లేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచి అక్కడ వేరే కేడర్ ని డవలప్ చేయించాడు చంద్రబాబు. ఆయనకు ఇటీవల గుండెపోటు వచ్చినా పరామర్శించలేదు,పల్నాడు ప్రాంతం వెళ్లినా కోడెలను పిలవలేదు, ఆయనని పరామర్శించలేదు. ఇదంతా పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని.

4..వర్ల రామయ్యలాంటి వారి ద్వారా కోడెల తప్పు చేశారు ఇది చేయకుండా ఉంటే బాగుండేది ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తే కేసులు పెట్టాల్సిందే అని, పార్టీ ఆఫీసులో వర్ల రామయ్యలాంటి వారి చేత మాట్లాడించారు? ఇది వర్ల రామయ్య స్టేట్ మెంట్ కాదు? చంద్రబాబు చెబితేనే వచ్చేమాట? ఎందుకు అంటే పార్టీలో సీనియర్ పై మరో సీనియర్ ఎలా ఆరోపణలు చేస్తారు ఇది ప్రజలు గుర్తించారు.

5.. కోడెలపై చట్టపరంగా ఏచర్య తీసుకున్నా తాము కాదు అనము అని చంద్రబాబు నేరుగా విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఫర్మిచర్ మిస్సింగ్ పై చంద్రబాబు నేరుగా ఈ మాట చెప్పారు ఇది వారి ఆస్దాన మీడియాలలో వచ్చినవే.

6.. గతంలో మంత్రి పదవి కూడా ఇవ్వకుండా చంద్రబాబు చేశారు, ఇప్పుడు పల్నాటి పులి అని ఆయనని చెబుతున్నాడు, కాని ఆనాడు ఇంత సీనియర్ ని ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు.

  1. గతంలో కావాలనే నరసరావు పేట అడిగినా సత్తెనపల్లి సీటు ఇచ్చారు అంత సీనియర్ ని ఇదేనా గౌరవించడం.

8.. సత్తెనపల్లి నుంచి గెలిచిన తర్వాత ఆయనమంత్రి పదవి అడిగితే కుదరదు అని స్పీకర్ పదవి ఇచ్చారు

9… ఫిరాయింపులపై స్పీకర్ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన డిస్ క్వాలిఫై చేస్తాను అంటే, చంద్రబాబు వద్దు అని అన్నారు. చివరకు కోడెల అన్ని విమర్శలు పడ్డారు

10 వైసీపీ బాధితుల క్యాంప్ పెట్టిన చంద్రబాబు అక్కడకు మాత్రం కోడెలను రాకుండా అడ్డుకున్నారు.. ఇలా అనేక రకాలుగా ఆయనను క్షోభ పెట్టారు.. నిజంగా కోడెల జగన్ బాధితుడు అయితే ముందు కుర్చీలో కుర్చోవాల్సింది బాధితుడిగా కోడెల అనేది ఇక్కడ గుర్తించాలి.. కాని పల్నాడులో కోడెలను మాత్రం రానివ్వలేదు ఇవన్నీ కూడా చంద్రబాబు చుట్టు వస్తున్న ప్రశ్నలు.9 రోజులు వైసీపీ బాధితుల క్యాంపులో కోడెల ఒక్కరోజు కనిపించలేదు.

11.. టీడీపీ నాయకులు సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు చేసేలా బాబు చేయించారు అనేది సొంత పార్టీ నేతలు చర్చించుకున్నారు.. ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని బాబు ఆలోచించారట. పార్టీలో ఆయన ఉంటే ఆయన కుటుంబం పై వచ్చిన ఆరోపణల వల్ల పార్టీకి మైనస్ అని బాబు ఆలోచనట.

12 చంద్రబాబుకి తాను అంత సాయం చేసినా అవన్నీ నేడు మర్చిపోయి తాను ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు కనీసం పలకరించడం లేదు అని బాధపడ్డారట కోడెల.. ఈ విషయాలు అన్నీ కోడెల చనిపోయే ముందు సూసైడ్ నోట్ లో రాశాడు అని భయపడిన చంద్రబాబు, సూసైడ్ లెటర్ లేదు అని తెలియడంతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అనేది ఇప్పుడు చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్నలు. మరి వీటిపై కూడా జనాలు ఆలోచిస్తున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.