
రైతులకు గుడ్ న్యూస్!…జనవరి 1న 12 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం
కొత్త సంవత్సరం కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. పీఎం కిసాన్ యోజన 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను కొత్త ఏడాదిలో జనవరి 1న, 12 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది.
కొత్త సంవత్సరం కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. పీఎం కిసాన్ యోజన 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను కొత్త ఏడాదిలో జనవరి 1న, మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది. మొత్తంగా రైతులకు ఈ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.22 వేల కోట్లను విడుదల చేయనున్నారు. స్వాతంత్య్రం తర్వాత రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు డిపాజిట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తొలి పథకం ఇదే కావడం విశేషం. ఈ స్కీమ్ కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 11 కోట్ల మంది రైతులకు రూ.1.61 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పీఎం కిసాన్ యోజన దేశంలోని చిన్న రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది.
పీఎం కిసాన్ నిధి విడుదల సందర్భంగానే ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలకు కూడా ఈక్విటీ గ్రాంట్లను విడుదల చేస్తున్నట్టు తెలిసింది. పీఎం కిసాన్ యోజన కింద ఇన్‌స్టాల్‌మెంట్లను విడుదల చేసిన ప్రతిసారి ప్రధాన మంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి కూడా ప్రధాని ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది. పీఎం ప్రసంగాన్ని వినాలనుకునే వారు దూరదర్శన్ లేదా pmindiawebcast.nic.inలో లాగిన్ అయి వినొచ్చు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్