
ప్రధాన పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే…అమ్మఒడి పథకంపై సినిమా
ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి పథకంపై సినిమా తీయడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే పాల్గుణ. తాను కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేయడం గర్వంగా ఉందన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ పథకంపై ఏకంగా సినిమా రాబోతోంది. శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ ఓ మూవీని తీస్తోంది. ఈ చిత్రంలో విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ షూటింగ్‌కు తహసీల్దార్ ప్రకాష్‌రావు క్లాప్ కొట్టారు. పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కొంత షూటింగ్ జరిగింది. ఎమ్మెల్యేపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి పథకంపై సినిమా తీయడం ఆనందంగా ఉందన్నారు. తాను కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ పథకాన్ని సీఎం జగన్ ఎంతో పారదర్శకంగా అందిస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు పేరుతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. అమ్మఒడి పథకంపై చిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు. ఈ సినిమాకు త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్