janampulse
Breaking News

ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్ కు ఆధార్‌ తప్పనిసరి

జూలై 1 2017 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు ఆధార్‌ తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌) కార్డు కోసం దరఖాస్తు చేసే వారు ఆధార్‌ను సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పాన్‌ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు సమర్థించిన. ఇప్పటి వరకు ఆధార్‌ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్‌కార్డుల్ని రద్దుచేయమని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో సందేహాల నివృత్తికి ‘తీర్పు ప్రభావం’ పేరిట మూడు అంశాలతో కూడిన ప్రకటనను సీబీడీటీ విడుదల చేసింది.
2017 జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలు చేసేవారు, పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి తమ ఆధార్‌ నంబర్‌ను లేదా తమ ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీని సమర్పించాలని స్పష్టం చేసింది

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.