
సరుకులకి సూపర్ మార్కెట్ కి వచ్చిన అల్లు అర్జున్
మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో, 21 రోజుల లాక్‌డౌన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠంగా అమలు చేస్తున్నాయి, ఎక్కడా రోడ్లపైకి జనాలు రావడం లేదు.. పెద్ద ఎత్తున సరుకులు కూడా కొనడానికి ఎవరిని రానివ్వడం లేదు.. దేనికి వచ్చినా ఉదయం 9 లోపు రావాలి, అంతే అది కూడా ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే రావాలి.
షాపింగ్ మాల్స్, జిమ్ములు, సినిమా థియేటర్లను మూసివేశాయి.నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలు అందించే వాటికే అనుమతి ఇచ్చాయి, ఇక సెలబ్రెటీలు కూడా ఇంటికి పరిమితం అయ్యారు, వారి పనివారిని ఇంటికి పంపించేశారు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరుకులు కొనడానికి సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పసుపు రంగు షూ, టీ షర్ట్, నల్ల రంగు షార్ట్ ధరించిన అర్జున్ ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులతో జూబ్లీహిల్స్‌లోని ఓ సూపర్ మార్కెట్లో కనిపించాడు. సాధారణ కస్టమర్ మాదిరిగా ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాడు.
అయితే ఆయనని కొందరు గుర్తించి ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు నిజమే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కుటుంబం కోసం కచ్చితంగా సరుకులకి రావాల్సిందే, అని అల్లు వారి అబ్బాయి నిరూపించాడు, గ్రేట్ బన్నీ
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్