janampulse
Breaking News

అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..? ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly)వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో (AP Cabinet Meeting) తేదీలు ఖరారు చేసే అవకాశముంది

Andhra Pradesh అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 20వ తేదీ తర్వాత సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 21 లేదా 22 తేదీల్లో సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు  STATE GOVERNMENT సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ నెలలో ఐదు లేదా ఆరు రోజులు.. డిసెంబర్లో మరికొన్ని రోజులు నిర్వహించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 16వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఆ మీటింగ్ లోనే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ అయ్యే అవకాశముంది. కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై పూర్తి స్పష్టత రానుంది.

ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవడంతో పాటుCORONA PREVENTION , వైరస్ వల్ల వచ్చిన నష్టాలు, వర్షాలతో మునిగిన పంటలు, రైతులకు సాయం, సంక్షేమ పథకాల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి హాట్ టాపిక్ గా మారే అవకాశముంది మరోవైపు గత అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్షTELUGUDESAM PARTY బాయ్ కాట్ చేసింది. ఈసారి మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, అభివృద్ధి పనులు, పెన్షన్ల నిబంధనల్లో మార్పులు, ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, పెరుగుతున్న ధరలు, ఇళ్ల నిర్మాణం, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు-దిశ చట్టం అమలు, అలాగే ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులు వంటి అంశాలపై వైసీపీని నిలదీయాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం శాసనమండలిలో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లోనే మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాకే ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల దృష్ట్యా.. 11కి 11 ఎమ్మెల్సీ స్థానాలు తమ ఖాతాలోనే చేరుతాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది మండలిలో తమ బలం పెరిగితే రాజధాని వికేంద్రీకరణ వంటి కీలక బిల్లుల విషయంలో తమకు తిరుగుండదనేది వైసీపీ భావన. కానీ ఇటీవల కొందరు పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడం, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవోంది. ఇప్పటికే మండలి రద్దు చేయాలంటూ కేంద్రానికి సిఫార్సు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యూహం ఎలా ఉంటుందని ఆసక్తికరంగా మారింది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.