
ఏపీలో ఇక సినిమాకు వెళ్లాలంటే జీవో వచ్చేసింది..YS Jagan వెనక్కి తగ్గని సీఎం..
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జీవో జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల పంపిణీకి సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా చెప్పిన విధంగా అనుకున్నది చేసేసింది. సినిమా టికెట్ల పంపిణీ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ)కు అప్పగించింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం.. ఆన్‌లైన్ టికెట్స్‌పై జీవో 142ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ కంపెనీ ద్వారానే ఆన్‌లైన్ ద్వారా సినిమా టికెట్ల అమ్మకాలు చేయాలని ఆదివారం జీవో జారీ చేసింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం ఈ జీవోని అమల్లోకి తీసుకొస్తునట్లు వివరించింది. ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాల బాధ్యతలను ఏపీ ఎఫ్డీసీకి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటివరకూ పేటీఎం, బుక్ మై షో, వంటి వాటి ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాలు జరుతున్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక, రైల్వే టికెట్లు అమ్ముతున్న IRCTC మాదిరిగానే.. త్వరలో సినిమా టికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తుందని జీవోలో పేర్కొంది.
కాగా, సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం సద్దుమణగకముందే జగన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సినిమా టికెట్ ధరల నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేవలం పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని మిగిలిన అన్ని థియేటర్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జీవో నెం.142ను తీసుకురావటం విశేషం.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్