janampulse

సింహపురిలో ఆనం కామెంట్లు రచ్చ రంగంలోకి జగన్

నెల్లూరు బాగా డెవలప్ అయ్యింది.. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఇలా మీకు ఏ మాఫియా కావాలన్నా నెల్లూరుకు రండి.. ఇక్కడే అందరూ దొరుకుతారు. ఈ మాఫియాల ఆగడాలకు నెల్లూరు నగరంలో వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. బయటికి చెప్పుకోలేక చస్తున్నారు. ఐదు సంవత్సరాలలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరు జిల్లాకే దక్కిందన్నది
ఈ కామెంట్లు చేసింది ఎవరో తెలుసా నెల్లూరులో పొలిటికల్ స్కూల్ గా పేరుగాంచిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… అయితే వైసీపీలో ఉండి ఇలాంటి కామెంట్లు ఎందుకు చేశారు అనేది పెద్ద చర్చగా సాగుతోంది ఏపీ రాజకీయాల్లో.
విపక్ష నాయకులు చేయాల్సిన కామెంట్లు ఈయన చేయడం ఏమిటి అనేది నెల్లూరులో జనం చర్చించుకుంటున్నారు.. అయితే దీని వెనుక ఏ వ్యూహం ఉంది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు.
అసలు నెల్లూరు జిల్లా పేరు చెబితే ముందు వినిపించేవి 3 రాజకీయ కుటుంబాల పేర్లు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తర్వాత ఆనం కుటుంబానిదే నెల్లూరులో పెద్దరికం.
వీరిలో ఆనం వర్గీయులు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు జిల్లాలో వారికంటూ ఫాలోయింగ్ కూడా ఉంది. సింహపురి రాజకీయాల్లో ఇప్పటికీ వారు అగ్రగణ్యులు అనే చెబుతారు. టీడీపీ నుంచి ఆయన వైసీపలో చేరారు అసెంబ్లి టికెట్ పొంది గెలిచారు, జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు ఆనం రామనారాయణ రెడ్డి. ఇక రాజకీయంగా సీనియర్లు పార్టీలో పక్కనే ఉన్నారు,కేవలం పార్టీలో సీనియర్లకే జగన్ పెద్ద పీట వేస్తున్నారు అనేది ఆయన వర్గం నుంచి వస్తున్న మాట.
జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని వేణుగోపాల స్వామి ఆలయం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆనం రామనారాయణ రెడ్డిలో అసహనానికి కారణమని జిల్లాలో అందరూ చెప్పుకుంటున్నారు. ఈ ఆలయ ట్రస్టీల కమిటీని రద్దు చేసి, ప్రభుత్వం తరపున ఆలయ కమిటీని నియమించేందుకు రంగం సిద్దమవుతోంది..గతం నుంచి చూస్తే ఆనవాయితీగా వెంకటగిరి సంస్థానాధీశుల ఐదు కుటుంబాలు ట్రస్టీలుగా ఉంటున్నారట. దీని వెనుక జిల్లా మంత్రి హస్తం ఉంది అని ఆనం వర్గీయులు మాట్లాడుకుంటున్నారు.
అల్తూరుపాడు రిజర్వాయర్ కూడా మరో ప్రధాన అంశంగా కనిపిస్తోందట.4 శాతం అధికంగా కోట్ అయ్యిందన్న సాకుతో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టెండర్ను రద్దు చేయించారు. దీంతో ఇది కూడా చిచ్చు రేపింది అంటున్నారు, దీని నిర్మాణ వ్యయం సుమారు 250 కోట్లు ..వేంకటగిరి రాజావారు నెలకొల్పిన ఈ వి.ఆర్. విద్యాసంస్థలపై ఆనం ఫ్యామిలీ పెద్దరికం చేసేది. ఇప్పుడు ఆ పెద్దరికం పోయి జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలోకి ఆ విద్యాసంస్థలు చేరిపోయాయి. అందుకే ఆనం ఈ కామెంట్లు చేశారు అంటున్నారు. సో దీనికి జగనే పరిష్కారం చూడాలి, లేకపోతే సింహపురిలో రాజకీయంగా చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.