జైలు నుంచి వచ్చిన చింతమనేనిపై మరో కేసు

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ కు అడ్డు అదుపు లేకుండా ఉండేది. అయితే ఆ సమయంలోనే ఆయనపై అనేక కేసులు విమర్శలు ఆరోపణలు వచ్చాయి. కాని ఆయనని మాజీ సీఎం చంద్రబాబు ఎలాంటి కట్టడి చేయలేదు అనే విమర్శలు వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఓటమి పాలైన చింతమనేనికి చుట్టుకుంటున్నాయి, జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దెందులూరులో కంటే జైలులోనే ఎక్కువ రోజులు ఉన్నారు అని ఆయన అభిమానులు బాధపడుతున్నారు,

ఇలా ఈ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాదాపు రెండు నెలలకుపైగా అంటే, అరవై రోజులు ఏలూరు జైలులో ఉన్నారు. ఆయనపై ఏకంగా 18 కేసులు నమోదయ్యాయి. వివిధ రకాల కేసులు అనే చెప్పాలి.. ముందుగా దళితులను దూషించిన కేసులో అరెస్టైన చింతమనేనికి కోర్టు గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. తర్వాత ఆయనపై ఉన్న పాతకేసులు ఒక్కొక్కటిగా విచారణకు రావడంతో మరికొన్ని కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో రిమాండ్తో చింతమనేని విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. చింతమనేని బెయిల్ పిటిషన్పై విచారించిన ఏలూరు జిల్లా కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

శనివారం ఏలూరు జైలు నుంచి విడుదలైన చింతమనేనికి 48 గంటలు గడవక ముందే ఆయనపై మరో కేసు నమోదయ్యింది. నిబంధనలను ఉల్లంఘించి, పోలీసు విధులకు ఆటంకం కల్పించారనే అభియోగాలతో ఏలూరు త్రీటౌన్ పోలీసులు ఈ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ప్రభాకర్తో పాటూ మరికొందరు అనుచరులపైనా కేసు ఫైలయ్యింది.

శనివారం ఏలూరు జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్.. జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ ర్యాలీ కోసం ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు ఎంతో హైప్ క్రియేట్ చేశారు.పశ్చిమగోదారవి జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని.. త్రీ టౌన్ సీఐ ఎంఆర్ఎల్ ఎస్ఎస్ మూర్తి తన సిబ్బందితో శనివారపు పేటలో గస్తీ నిర్వహిస్తుండగా.. చింతమనేని ప్రభాకర్ ర్యాలీగా వస్తూ ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్పించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీస్ వాహన చట్టాన్ని ఉల్లంఘించారని కేసు పెట్టారు. దీంతో చింతమనేని అభిమానులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.