నేడు మరో కీలక ఘట్టం వైసీపీ నేతల కల నెరవేరింది

YSR-congress-party

జగన్ అనే నేను ఈ మాట వినేందుకు ఏపీ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్న జగన్ కు సపోర్ట్ గా నిలిచారు.. ఈ గ్రాండ్ విక్టరీతో వైసీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు అని చెప్పాలి.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ కోసం ఈరోజు మరో లాంఛనం పూర్తికాబోతోంది. ఇప్పటికే పార్టీ నేతలతో ఫుల్ బీజీగా రెండు రోజులు పలకరించిన జగన్ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈరోజు తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం అవుతున్నారు, ఇదే రోజు కోసం పార్టీ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

సరిగ్గా ఉదయం 10 గంటల 31 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జగన్ ను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఆ నేతలు కల ఈ రోజు నెరవేరబోతోంది ఇక ఆకార్యక్రమం పూర్తి అయిన వెంటనే జగన్ కొందరు కీలక నేతలతో కలిసి గన్నవరం నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు అక్కడ ప్రత్యేకంగా గవర్నర్ ను కలిసి ఎమ్మెల్యేలు సంతకం చేసిన శాసనసభాపక్ష తీర్మానాన్ని నరసింహన్ కు అందజేస్తారు. దీంతో తొలి ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇక తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ను కోరతారు, ఆ ఆహ్వానం మేరకు ఆయన తేదిని కూడా చెబుతారు.30వ తేదీన విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి గవర్నర్ కు ఆహ్వానం పలుకుతారు.

ఇక జగన్ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా కలవనున్నారు , అక్కడ నుంచి పార్టీ నేతలతో చర్చలు జరపనున్నారు, ఇక ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తాను అని చెప్పిన జగన్ కేసీఆర్ తో ఇప్పటి రాజకీయాలు చర్చిస్తారు. ఇక రేపు హస్తిన వెళ్లి జగన్ ప్రధానిగా ఎన్నిక అయిన మోదీని కూడా గౌరవంగా కలువనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న మోడీని అభినందించబోతున్నారు. ఇదే సమావేశంలో ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని కూడా మోడీ దగ్గర ప్రస్తావిస్తారు జగన్. మొత్తానికి జగన్ షెడ్యూల్ ఇలా ఉండబోతోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.