వైసీపీలోకి మరో కీలక నేత ఎమ్మెల్యేతో మంతనాలు

Another key leader into the YCP is negotiating with the MLA

టీడీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల నుంచి బయటకు వచ్చిన వారు చాలా మంది ఇప్పుడు, అధికార వైసీపీ వైపు చూస్తున్నారు.. ముఖ్యంగా వైసీపీలోకి వీరి రాకకు పార్టీ అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు…కనకదుర్గ దేవస్థాన మాజీ సభ్యుడు, టీడీపీ నేత వెలగపూడి శంకర్బాబు వైసీపీలోకి చేరుతున్నట్లు పెనమలూరు నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది…. ఇటీవల కంకిపాడులో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్బాబు ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కోసం రెండు గంటలు నిరీక్షించారు. అంతేకాదు కుటుంబ సభ్యులకు సంబంధించి ఓ వివాదం గురించి ఎమ్మెల్యేని కలిశారు.

అంతటితో ఆగక ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. గతంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి శంకర్బాబు తెలపడంపై వైసీపీ నేతలు సైతం అవాక్కవుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టిన పదవిని చూపించి ఎమ్మెల్యేని కలవడం పట్ల టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. శంకర్బాబు వైసీపీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో టీడీపీ అలర్ట్ అయింది. కాని ఆయన త్వరలో వైసీపీ కండువా కప్పుకుంటారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.