
ఆనం కుటుంబానికి మరో కీలక పదవి
ఆనం పొలిటికల్ స్కూల్లో చాలా మంది నాయకులు అక్కడ రాజకీయాలు నేర్చుకుని రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్నారు..కాంగ్రెస్ పార్టీ లో ఆనాడు పొలిటికల్ గా లీడర్లు అయిన వారు ఉన్నారు, ఇప్పుడు ఆనం కుటుంబం వైసీపీలో ఉంది.
వైఎస్ హయాంలో ఆయనకు సన్నిహితులుగానే ఆనం సోదరులు ఉండేవారు, గతంలో వైయస్ మరణించిన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి సీఎం అయిపోతారనే ఊహాగానాలు కూడా వచ్చేవి.
ఇక తర్వాత కాంగ్రెస్ గాలివానలో ఆనం సోదరులు కూడా ఓటమి పాలయ్యారు, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వివేకానందరెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారి సోదరుడు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనే ఆనం విజయ్ కుమార్ రెడ్డి.అనారోగ్యంతో వివేకానందరెడ్డి మరణానంతరం రామనారాయణ రెడ్డి చంద్రబాబుకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు.
ఈ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సీఎం జగన్.. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు… ఈ గెలుపుతో మంత్రి పదవి వస్తుంది అని అనుకున్నారు కాని కాకాణి, అనిల్, గౌతమ్ రెడ్డి లాంటి నేతలు లిస్టులో ఉన్నారు కాబట్టి జగన్ ఆనం బ్రదర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు, అయితే సింహపురిలో ఇప్పుడు ఆనం ఫ్యామిలీ మళ్లీ చక్రం తిప్పాలనుకుంటోంది.
జగన్ తాజాగా ఆనం విజయ్ కుమార్ రెడ్డికి కీలక పదవి ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో జడ్పీ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పీఠం విషయంలో విజయ్ కుమార్ రెడ్డికి జగన్ ఆ పీఠం ఇస్తాను అని చెప్పారట, దీంతో ఆనం కుటుంబంలో సందడి మొదలైంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్