బొబ్బిలి కోటలో టీడీపీకి మరో షాక్

విజయనగరం జిల్లాలో రాజకీయంగా కీలక మార్పులు జరుగనున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.. గత వైభవం టీడీపీకి అక్కడ లేదు అనే చెప్పాలి.. ఈ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లు అందరూ ఓటమి పాలయ్యారు… తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, తెర్లాం మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు కూడా ఇది మింగుడుపడని వార్త అయింది. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జిల్లాలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. మరి ఈ వార్తలను ఆయన కూడా ఖండించలేదు. వాస్తవంగా పార్టీల తరపున చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, తెంటు లక్ష్మునాయుడు మధ్య సత్సంబంధాలు లేవు.

ఈ సమయంలో లక్ష్మునాయుడిని చేర్చుకునేందుకు వైసీపీ సిద్దంగా లేదనే మాట ముఖ్యంగా శంబంగి వర్గం చెబుతోంది… జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తెంటు పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆయన వస్తే ఆయనకు ఏపదవి పార్టీ తరపున ఇస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెర్లాం సీటు తనకు పదిలమవుతుందని తెంటు భావిస్తున్నారట ఆయనతో పాటు బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్విఎస్కెకె రంగారావు బేబీనాయన కూడా వైసీపీలోకి వెళతారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

అయితే ఇక్కడ మరో చిక్కు ముడి ఉంది.. మాజీ మంత్రి ఆర్వీ సుజయ్కృష్ణరంగారావును వీడి ఈ సోదరుడు ఒక్కరే పార్టీలో చేరుతారా అనే చర్చ జరుగుతోంది..ఇప్పటికే మంత్రుల ద్వారా నేతల ద్వారా జిల్లా నాయకలు సమాచారం మేరకు బేబీనాయన రాకను సీఎం జగన్ స్వాగతిస్తారు అని తెలుస్తోంది. ఒకవేళ వారికి వైసీపీలో అవకాశం లేకపోతే, బీజేపీ ద్వారాలు తెరిచి ఉన్నాయి అంటున్నారు.. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు మాత్రం టీడీపీకి పెద్ద షాక్ ఇవ్వనున్నారు అని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.