
పులివెందులకు ఏపీ ముఖ్యమంత్రి వరాల జల్లు
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా తన సొంత సెగ్మెంట్ పులివెందులలో పండుగ జరుపుకున్నారు …అంతేకాదు కడప జిల్లాలో తన మూడో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో ఏపీ సీఎం వైఎస్ జగన్, సొంత నియోజకవర్గంపై వరాల వర్షం కురిపించారు.
పులివెందులలో మండలాల్లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇప్పటికే నిర్మితమైన భవనాలను ప్రారంభించారు. పులివెందులలో నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సీఎం ప్రారంభించారు.
347 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాలకు జగన్ శంకుస్థాపన చేశారు. తన కుటుంబం పై మీరు చూపిస్తున్న ప్రేమ మరువలేనిది అని తెలియచేశారు.
పలు ఇరిగేషన్ కెనాల్స్ ప్రాజెక్టులకు మండలాల్లో శంకుస్ధాపనలు చేశారు. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజికి సుమారు 100 కోట్లు ప్రకటించారు, అలాగే పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ కు 20 కోట్లు కేటాయించారు
.. గండికోట రిజర్వాయర్ దిగువన 20 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంతో డ్యామ్ నిర్మిస్తామని, ఇందుకు సంబంధించిన సర్వే పనులు ప్రారంభమయ్యాయని జగన్ తెలియచేశారు. అలాగే రైతులకు ఇబ్బంది లేకుండా సెగ్మెంట్లో 7 గిడ్డంగులు గొడౌన్లు ఏర్పాటు చేస్తాము అని తెలిపారు, మరో రెండు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాము అన్నారు.
వేంపల్లి ఆసుపత్రిలో ప్రస్తుతమున్న 30 పడకలను 50 పడకలకు పెంచేందుకు నిధులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీ కోసం రూ. 17.50 కోట్లను మంజూరు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్ కోసం రూ. 20 కోట్లను, పులివెందుల మినీ సచివాలయానికి రూ. 10 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఇవన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి పనులు కూడా ప్రారంభించాలి అని అధికారులకు తెలిపారు, ఇక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకు తెలియచేయాలి అని చెప్పారు సీఎం జగన్.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్