
ఒక్కొక్కరికి రూ.35వేలు!…ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త
ఆ లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలేనని.. వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి రుణాలు ఇస్తే.. మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఏపీలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాంకర్లను కోరారు. ఇళ్ల లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలేనని.. వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి రుణాలు ఇస్తే.. మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని.. జియో ట్యాగింగ్ చేసి, వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగించామన్నారు.
ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా నాలుగైదు లక్షల రూపాయల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. సిమెంట్, స్టీలు తదితర వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, పనులు కూడా విరివిగా లభిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల లబ్ధిదారులకు రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకు వేయాలని, చురుగ్గా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు సీఎం. రైతులు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? తదితర వివరాలన్నింటినీ ఆర్బీకేల ద్వారా ఇ–క్రాపింగ్‌కు అనుసంధానం చేశామన్నారు. ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగు చేస్తున్న రైతులని.. సీసీఆర్‌సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారిస్తున్నామన్నారు. అందువల్ల బ్యాంకర్లు ముందుకు వచ్చి వారికి రుణాలు ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికీ పంట రుణాలు కచ్చితంగా రుణాలు అందాలన్నారు.
మరోవైపు చిరు వ్యాపారులకు అండగా ఉండలన్నారు జగన్. ఇప్పటి వరకు 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారన్నారు. లబ్ధిదారులందరికి రూ.10వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయన్నారు. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకుంటామని.. అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలన్నారు. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలి అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్