
రూ. 10 వేల కోట్లు..ఆ ఇళ్లు అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టొచ్చు:YS Jagan శుభవార్త
ఏపీలో ఓటీఎస్ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్) పథకంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. విపక్షాలపై సీఎం జగన్ కౌంటర్ అటాక్‌కు దిగారు. ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై బుధవారం సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఈ సందర్భంగా, ఓటీఎస్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటీఎస్ అనేది పూర్తిగా స్వచ్ఛందమని తేల్చి చెప్పారు. లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా పేదలపై రూ. 10 వేల కోట్ల భారాన్ని తొలగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ విషయంలో పేదలకు ఉన్న రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నట్లు వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా పేదలకు సంపూర్ణ హక్కులు వస్తాయని స్పష్టం చేశారు. ఓటీఎస్‌పై ప్రజలకు సంపూర్ణ అవగాహన తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇక, ఓటీఎస్ పథకం అమలు కాకుండా చాలామంది పలు రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. గతంలో కనీసం వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలను కూడా టీడీపీ ప్రభుత్వం పరిశీలించలేదని వివరించారు. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని.. ఇవాళ మాట్లాడుతున్నవారు అప్పుడు ఎందుకు కట్టించున్నారని నిలదీశారు. అసలు, వడ్డీ కడితేనే బీ– ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారని.. ఇప్పుడు ఓటీఎస్ పథకం ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణ హక్కులు ఇస్తున్నామని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని చెప్పారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న సీఎం జగన్.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టమని తేల్చి చెప్పారు.
డిసెంబర్ 21వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్.. వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ పనులు కూడా జరుగుతాయని వెల్లడించారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్