janampulse

ఆ ఛాన‌ల్ ని వ‌దిలిపెట్ట‌ను- ఏపీ ఉప ముఖ్య‌మంత్రి

ap deputy cm amjad basha sensational comment on yellow media

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి అవుతుంది అని అంద‌రూ అనుకుంటున్న వేళ ఒక్క‌సారిగా ఇది విజృంభించింది.. దీని తీవ్ర‌త మ‌రింత పెరిగింది ..మ‌రీ ముఖ్యంగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన ప్రార్థనల వల్ల చాలా మందికి కరోనా వైరస్‌ వ్యాధి సోకడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, ఇప్పుడు ఇక్క‌డ‌కు ఎవ‌రు వెళ్లారు వారి ఆరోగ్యం ఎలా ఉంది ఇలా ప్ర‌భుత్వం అన్నీ ప‌రిశీలిస్తోంది.

వారి కుటుంబాల‌ని కూడా క్వారంటైల్ కి ఐసోలేష‌న్ కి త‌ర‌లించారు..ఈ నేపథ్యంలో ఆ ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా కూడా వెళ్లారని వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. మార్చి 2న ముస్లింలకు సంబంధించిన 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయంపై మాత్రమే తాను ఢిల్లీ వెళ్లానని చెప్పారు.

త‌ర్వాత తాను మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నానని ఆయ‌న వివరించారు. కావాల‌నే కొంద‌రు ఇలాంటి అసత్య వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. అయినా అక్క‌డ‌కు వెళితే చెబుతాం కాని దాచేది ఏదీ లేదు అన్నారు, ఇలా కావాల‌నే ఓ మీడియా ప్ర‌చారం చేస్తోంద‌ని విమ‌ర్శించారు నిజాలు తెలుసుకోకుండా తనపై దుష్ప్రచారం చేసిన ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు.

తాను ఆ సభలకు వెళ్లలేదని నిరూపించుకుంటే ఆ ఛానల్‌ను మూసేస్తారా? అని ప్రశ్నించారు. మ‌రి ఇదీ నిజ‌మే వాస్త‌వాలు తెలుసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు వార్త‌లు ఇవ్వ‌డం త‌ప్పు అంటున్నారు ప్ర‌జ‌లు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.