ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కొత్త రికార్డు

AP deputy speaker Kona Raghupathi record

ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంని జగన్ వైసీపీ నేతలు ఎంచుకున్నారు.. సభ కూడా జరుగుతుంది. ఇక డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతిని ఎంచుకున్నారు. మరికొద్ది గంటల్లో ఆయన ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు.డిప్యూటీ స్పీకర్ గా, కోన ఒక్కడే నామినేషన్ వేయటం, దానిని బలపరుస్తూ 20 మంది MLA లు సంతకాలు పెట్టటం జరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఓ చర్చ కొత్త విషయం బయటకు వచ్చింది. కోన కుటుంబంలో ఓ కీలక విషయం వచ్చింది.

ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా నియమితులు అయిన కోన రఘుపతి తండ్రి, కోన ప్రభాకర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేశారు. 1981 ఫిబ్రవరి 24 నుంచి 1981 సెప్టెంబర్ 22 వరకు అయన ఏపీ స్పీకర్ గా పనిచేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. తర్వాత పుదుచ్చేరి, సిక్కిం, మహారాష్ట్రలకు గవర్నర్ కూడా పనిచేశారు. ఇలా కోన కుటుంబానికి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆ కుటుంబం నుంచి ఇద్దరు స్పీకర్లుగా చేయడం రికార్డు అనే చెప్పాలి.

ఇక వైయస్ జగన్ వెంట ముందు నుంచి నడిచిన రఘుపతి, గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి 2014 ,2019 ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ తరుపున గెలిచారు . జిల్లాలో జగన్ కి బాగా నమ్మకస్తుడు అనే పేరు కోన రఘుపతి ఉంది. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన స్టేట్ లో కీలక నేతగా బ్రాహ్మణుల్లో వైసీపీ తరపున పేరు సంపాదించుకున్నారు, ఇక జగన్ కూడా వైశ్య వర్గానికి చెందిన వెల్లంపల్లికి మంత్రి పదవి ఇచ్చి, ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇక్కడ రెండు సామాజిక వర్గాలకి న్యాయం చేశారు అని చెప్పాలి.. గూంటురు జిల్లా నుంచి గత ఎన్నికల్లో గెలిచిన కోడెల స్పీకర్ గా పనిచేస్తే, ఇప్పుడు వైసీపీ తరపున డిప్యూటీ స్పీకర్ గా గుంటూరు జిల్లా కు చెందిన నేత అవడం ఇది కూడా రికార్డుఅనే చెప్పాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.