janampulse
Breaking News

కోర్టుకు ఏం చెప్పిందంటే..!అమరావతిలో పెండింగ్ నిర్మాణాలపై ప్రభుత్వం క్లారిటీ:AP Capital Issue

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి (Capital Amaravathi) లో నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేస్తారా..? లేదా..? అనేది చర్చనీయాంశమైంది.

 (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గత నెలలో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో రిపీల్ బిల్లు ప్రవేశపెట్టింది. త్వరలోనే పాలనా వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా రూపొందించి మరోసారి సభ ముందుకు తీసుకొస్తామని అప్పట్లో  (CM YS Jagan) ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి (Capital Amaravathi)లో నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేస్తారా..? లేదా..? అనేది చర్చనీయాంశమైంది. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్నప్పటికీ రైతుల పిటిషన్లపై విచారణ జరుగుతూనే ఉంది. గత విచారణ సందర్భంగా రాజధానుల ఉపసంహరణ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో తదుపరి విచారణ సమయానికి పూర్తి సమాచారంతో రావాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

గవర్నర్ ఆమోదంతో బిల్లులకు చట్టబద్ధత వచ్చినట్లు గత నెల 13న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను అఫిడవిట్ తో పాటు కోర్టుకు సమర్పించింది. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపీల్ బిల్లులను కూడా జత చేసింది. ఈనెల 27న రాజధానిపై కోర్టలో విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది

రాజధాని అమరావతిలో పెండింగ్ నిర్మాణలపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టతనిచ్చింది. రాజధానిలో నిర్మాణాల పూర్తికి గతంలో అంచనా వేసిన ప్రకారం ఇంకా రూ.13,058384 కోట్లు చెల్లించాల్సి ఉందని.. తాజాగా దానిని రూ.4.377.35 కోట్లకు కుదించింది. అలాగే రూ.16,223.14 కోట్లతో ఎల్పీఎఫ్ లేఅవుట్ల అభివృద్ధికి వెచ్చించాల్సి ఉండగా.. దానిని రూ.6,715.53 కోట్లకు కుదించి పనులకు సీఎం అంగీకారం తెలిపినట్లు అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10వేల కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. అలాగే కృష్ణా నది కరకట్ట రోడ్డును కొండవీటి వాగు ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నుంచి రాజధానిలోని ఎస్13 రోడ్డు వరకు బలోపేతం చేసేందుకు రూ.150 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వీటితో పాటు హైకోర్టుకు అదనపు భవనాల నిర్మాణానికి రూ.33.5 కోట్లతో పనులు ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.