
గ్రామాలకు శుభవార్త.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
చాలా రోజులుగా ఈ ప్రోత్సహకాల కోసం ఎదురు చూశారు. ఇటీవలే గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఆ ప్రతిపాదనల్ని పరిశీలించి.. మొత్తానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
పీ ముఖ్యమంత్రి YS JAGAN ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను విడుదల చేసింది. ఈ మేరుకుప్రభుత్వం రూ.134 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను జిల్లాల వారీగా కేటాయించారు. చాలా రోజులుగా ఈ ప్రోత్సహకాల కోసం ఎదురు చూశారు. ఇటీవలే గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఆ ప్రతిపాదనల్ని పరిశీలించి.. మొత్తానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన 2199 గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల కోసం రూ.134 కోట్లు అవసరమని అధికారులు తేల్చారు. ఆ వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏకగ్రీవాల్లో 2వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలకు రూ.5 లక్షలు, 2వేల నుంచి 5వేల లోపు రూ. 10లక్షలు, 5వేల నుంచి 10వేలలోపు రూ.15 లక్షలు, 10వేల కంటే మించి జనాభా కలిగిన పంచాయతీలకు రూ.20 లక్షలు కేటాయించారు.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఏక్రగీం అయ్యే పంచాయతీలకు ప్రోత్సహకాలు ప్రకటించింది. సామరస్యపూర్వకంగా ఏకగ్రీవాలు అయితే గ్రామ జనాభా ఆధారంగా వీటిని కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల జరిగి దాదాపు 10 నెలలు దాటిన నిధులు మాత్రం విడుదల కాలేదు.. ప్రతిపక్షాలు కూడా దీనిపై విమర్శలు చేశాయి. ఇప్పుడు మొత్తానికి నిధులు విడుదలయ్యాయి.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్