
హైకోర్టు సంచలన తీర్పు…YS Jagan సర్కారుకు ఎదురుదెబ్బ.. సినిమా టికెట్ల ధరలపై
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరలు తగ్గిస్తూ తీసుకొచ్చిన జీవో కొట్టివేత!
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరోసారి ఊహించని షాకిచ్చింది. సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సినిమా టికెట్ రేట్ల తగ్గిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన టికెట్ ధరల తగ్గింపు జీవో తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జగన్ సర్కారు నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టులో థియేటర్ల యాజమాన్యాల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. థియేటర్ల యాజామాన్యాల తరఫున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గప్రసాద్ వాదించారు. దీంతో సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పగా.. పిటిషనర్ తరఫు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్