బీర్ సర్వరోగ నివారిణి అంటున్న మంత్రి!!

మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలి కేవలం ఖజానా నిండిందా లేదా అని చూసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖా మంత్రి కే.ఎస్. జవహర్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం ధన దాహాన్ని వెల్లడి చేశాయి. మద్యం మార్కెటింగ్ లో కొత్త పద్ధతులకు తెరలేపుతూ బీరును హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తున్నామని మంత్రి వర్యులు వెల్లడించారు.
అసలు బీరు హెల్త్ డ్రింక్ ఎలా అవుతుందో అని ఏపీ జనాలు జుత్తుపీక్కుంటున్నారు. బీరు ఆల్కహాలు శాతం ఉంటుందని స్పష్టంగా రాసి ఉంటుంది. అలానే మద్య తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిక కూడా కనిపిస్తుంది. అయినా సరే బీరును హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తామని చెప్పడం చంద్రబాబు ప్రభుత్వ ప్రత్యేకతకు నిదర్శనంగా కనిపిస్తోంది.
మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం చూసినప్పుడే అక్కడ ప్రజల పతనం ప్రారంభమవుతుంది. పైకి నీతులు ఎన్ని చెపుతున్నా ప్రజల చేత వీలైనంత తాగించి వారిని మరింత దిగజార్చేలా చేయడమే ప్రజా సంక్షేమమా? చూస్తుంటే పాలు సరఫరా చేసినట్టే బీరును కూడా ఇంటింటికి సరఫరా చేస్తారేమో!!

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.