
మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..YS Jagan జగన్‌కు మోదీ సంపూర్ణ మద్దత ఇద్దరూ
PM Modi దేేశంలో పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించినా..రాష్ట్రంలో మాత్రం వ్యాట్ తగ్గించలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ , రాష్ట్రంలో సీఎం జగన్ లూటీ సోదరులుగా మారారని శైలజానాథ్ ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచారని మండిపడ్డారు. యూపీయే హయాంలో కంటే క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్నా, భారీగా పన్నులు రూపంలో వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో రూ.60 ఉన్న లీటరు పెట్రోల్ ధరను బీజేపీ పాలనలో ఏకంగా రూ.115 చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయనీ, ఆ లెక్కన లీటరు పెట్రోల్ రూ.50కి ఇవ్వవచ్చన్నారు. జగన్ ప్రభుత్వం అదనంగా దీనికి రూ.21 పన్ను విధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రహదారులు దారణంగా ఉన్నాయన్నారు. అయినా ప్రత్యేకంగా రోడ్డుసెస్ పేరుతో ప్రజల నుంచి అదనపు సుంకాలు వసూలు చేస్తూ మరింత భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. జగన్‌కు ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతుందని సాకే పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం వసూలు చేస్తున్న ట్యాక్స్‌ను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. విలువైన గంగవరం పోర్టు భూములను చౌకంగా విక్రయించారని, బొగ్గు కొనుగోళ్లు కూడా అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను అగమ్యగోచరంగా మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నవంబరు 14 నుంచి ‘జనజాగారణ’ పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తామని శైలజానాథ్ తెలిపారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్