మాజీ ప్ర‌ధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్ ఇక లేరు

Atal bihari vajpayee died

జ‌గ‌మంత కుటుంబం ఆయ‌న‌ది ఆయ‌న‌ది భార‌త జాతి అని చెప్పిన నాయ‌కుడు… దేశ రాజ‌కీయాల్లో భీష్మపితామ‌హుడిగా ఆయ‌న‌కు పేరు.. ఆయ‌నే మాజీ ప్రధాని, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93)ఆయ‌న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు.ఆయ‌న ఈరోజు సాయంత్రం 5గంట‌ల 5 నిమిషాల‌కు క‌న్నుమూశారు. ఈవిష‌యాన్ని ఎయిమ్స్ వైద్యులు ధ్రువీక‌రించారు.. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు

ఇంటి ద‌గ్గ‌ర చికిత్స్ తీసుకున్నా ఆయ‌న‌కు ఈ ఏడాది జూన్ 11 న మ‌రింత ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయ‌న్ని ఆస్ప‌త్రిలో చేర్చారు ఆనాటి నుంచి ఎయిమ్స్ లోనే చికిత్స తీసుకున్నారు వాజ్ పెయ్….అటల్ బిహారీ వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డిసెంబర్ 25, 1924న మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయీ. ఆయన తండ్రి కృష్ణబిహారీ గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వాజ్‌పేయీ గ్వాలియర్‌లోని సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదివారు. కాన్పూరులోని ఆంగ్లో వైదిక కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.

1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత మొత్తం ఆయనపైనే పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వాజ్‌పేయీ సేవలందించారు. ఆయ‌న మ‌ర‌ణంతో బీజేపీ శ్రేణులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.