బాబు ఓసారి హస్తినకు పోయి రావలెను

ఓపక్క బీజేపీకి దూరమైన చంద్రబాబుకు, ఏపీలో తనకు రాజకీయంగా జగన్ యముడులా తయారు అయ్యాడు అనే బాధ ఆయనతో పాటు టీడీపీలో సీనియర్లకు కలుగుతోందట. బాబుకి ఇంత దారుణమైన బాధ వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు అంటున్నారు సీనియర్లు, అయితే చంద్రబాబు పాలన చూసిన జనాలే ఓట్లు వేశారు. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించాలి కాని బాబు మాత్రం జగన్ పాలనపై విమర్శలు చేస్తునే ఉన్నారు, ఆయనకు పవన్ కూడా తోడయ్యారు, అయితే పవన్ తో జోడి కడితే మళ్లీ టీడీపీకి కలిసి వచ్చేది ఏదైనా ఉందా అంటే అలాంటి అవకాశం లేదు అనేది తెలుస్తోంది.

అందుకే బీజేపీతో చెలిమికే చంద్రబాబు సై అంటున్నారు.. నాడు చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చుకునే దిశగా బాబు అండ్ టీమ్ రెడీ అవుతోంది.. రాజకీయంగా చేశాము అంతే కాని మీకు మాకు కక్షలు లేవు కదా అనేలా చెబుతున్నారట.. ఇటీవల ఏపీ రాజధాని అమరావతి ఇండియా మ్యాప్ లో లేకపోవడంతో దీనిని పార్లమెంట్ లో ప్రస్తావించారు ఎంపీ గల్లాజయదేవ్…ఈ ప్రశ్నతో వెంటనే అమరావతి పేరుతో ఉన్న మనదేశ పటాన్ని విడుదల చేసింది కేంద్రం.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పేందుకు టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అయితే ఈ సమయంలో బాబు భాదలు ఏపీలో సైకిల్ కు తగులుతున్నదెబ్బలు అన్నీ కూడా వివరించారట.. ఎలా ఉండే పార్టీ ఎలా మారింది అనేలా చెప్పారట. తమ క్యాడర్ మీద ఏపీలో దాడులు జరుగుతున్నాయని.. తమ మీద మాత్రమే కాదు బీజేపీ కార్యకర్తల మీదా జగన్ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు అని వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలో బాబు కూడా హస్తిన బాటపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు కొందరు తెలుగుదేశం నేతలు. మొత్తానికి జగన్ ని బయపెట్టాలి అన్నా, టీడీపీ నేతలపై ఇలా కేసులు ఆగాలి అన్నా బాబు హస్తినకు వెళ్లాల్సిందే అని పార్టీ నేతలు చెప్పుకుటున్నారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.