సంవత్సరం వరకూ దిల్లీకి చంద్రబాబు నో జర్నీ ఎందుకంటే

Because Chandrababu no Journey to Delhi for the year

పార్లమెంట్లో పదిశాతం కాదు 5 శాతం అంటే 25 ఎంపీ సీట్లు ఇస్తే తాను హస్తినలో చక్రం తిప్పుతాను అని చెప్పారు చంద్రబాబు, అసలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా కూడా తన కుమారుడ్ని పీఎం చేయడానికి అంత సాహసించలేదు, కాని బాబు మాత్రం రాహుల్ తో భేటీలు బీజేపీ యాంటి పక్షాలతో సమావేశాలతో ఎల్లో మీడియా అటెన్షన్ లో పడ్డారు. మోదీ భయపడుతున్నారు బాబు హస్తినలో భీకర ప్లాన్స్ అంటూ ప్రచారం చేశాయి. చివరకు అన్నీ తుస్ మన్నాయి.

ఇక్కడ బాకాలు పలికే ఛానల్స్ పెద్ద ఎత్తున వైరల్ చేశాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు హస్తిన వెళ్లడానికి ఇష్టపడడం లేదు, ఎందుకు అంటే తనకు 40 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది అని చెప్పేవారు చంద్రబాబు, రాజకీయంగా తాను సీనియర్ అని చెప్పేవారు, మరిసౌత్ లో కూడా ఆయన సీనియర్ కాదు అనేది అందరూ గుర్తు చేస్తూ ఉంటారు, దివంగత తమిళనాడు సీఎం కరుణానిధి లేరా, ఆయన అంత సీనియర్ ఇప్పుడు దేశంలో లేరు అని చెప్పాలి.

అయితే చంద్రబాబు రాజకీయం ఎలాంటిదో తెలిసిందే.. కేంద్రంలో చక్రం తిప్పుతా అని చెప్పిన చంద్రబాబు ఏపీలో కూడా తాను చక్రం తిప్పలేకపోయారు. మొత్తానికి గాలి జగన్ వైపు ఉంది అని తెలుసుకోలేక ఇబ్బంది పడ్డారు… ఇప్పుడు కేంద్రంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ పార్టీలను కలిసినా బాబు జీ ఎన్ని సీట్లు తమరు గెలుచుకున్నారు అంటే ? ముచ్చటగా మూడు అని చెప్పాల్సిన పరిస్ధితి వచ్చింది. ఇది ఏ నాయకుడికి అయినా ఇబ్బందే, పైగా అసెంబ్లీలో బొటా బొటీగా ప్రతిపక్ష పార్టీ హోదా (18) సాధించుకుంది ఆ పార్టీ అంటే 23 స్ధానాలు గెలిచారు కాబట్టి.

అందుకే హస్తిన వెళ్లి మళ్లీ అక్కడ ప్రజాస్వామ్యం గురించి, మోదీ గురించి, జగన్ గురించి కామెంట్లు చేస్తే మీడియా వారు కూడా కవర్ చేయరు, ఇప్పటికే మమతా అసలు పట్టించుకోవడం లేదు, రాహుల్ పాపం తన పదవిని పక్కన పెట్టేశాడు, ఇక సోనియా కూడా ఎలాంటి చర్చలకు ముందుకు రావడం లేదు, కుమారస్వామి పాపం ఆయన పార్టీ ప్రభుత్వం ఏమిటి అని టెన్షన్ లోఉన్నారు, ఓ పక్క స్టాలిన్ జగన్ కు ద్గగర అవుతున్నాడు ,నెక్ట్స్ తమిళనాడులో ఎన్నికలు కాబట్టి, ఇక తెలంగాణలో కేసీఆర్ మిత్రుడుగా ఉన్నాడు, ఇక జమ్మూనుంచి వచ్చి జగన్ పై ఏదో కామెంట్ చేసి వెళ్లిన పెద్దాయన ప్రచారం కూడా కలిసిరాలేదు, మాయావతి అక్కడ సైకిల్ పార్టీని పక్కన పెడుతోంది ఏపీ సైకిల్ ఎందుకు అని వదిలేసింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికలకు సిద్దం అవుతున్నారు, బాబుకు టచ్ లో లేరు. శరత్ పవార్ కూడా ఇక ఏపీలో జగన్ కు పవర్ వచ్చింది అనిబాబుని పట్టించుకోవట్లేదు. సో బాబుకు మాత్రం ఈ ఎన్నికలు చాలా నేర్పించాయి, ఎంత అంటే దాదాపు 40 ఏళ్ల అనుభవాలను కేవలం 40 రోజుల్లో తిరగరాసే అంత.

విశ్లేషణ-వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.