
భీమవరం ఎమ్మెల్యే ఓ రేంజ్‌లో..Pawan Kalyan కు ఎవరైనా నిజాలు చెప్పండయ్యా
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై భీమవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా నిజాలు చెప్పండయ్యా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సినిమాలు వేరు.. వాస్తవ జీవితం వేరని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
వీరవాసరంలో గెలుపొందిన తమ వారు సంబరాలు చేసుకోకుండా అధికార పార్టీ అడ్డుపడుతోందని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వాస్తవ విరుద్ధమైన సమాచారం ఇస్తూ పవన్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సంబరాలు చేసుకోకుండా మేం ఎవరినీ అడ్డుకోలేదని.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే తమ సొంత పార్టీ వైసీపీ నాయకులను సంబరాలకు దూరంగా ఉండాలని సూచించానని తెలిపారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వాస్తవాలు తీసుకెళ్లాలని అక్కడ ఉన్న ముగ్గురు జనసేన పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్‌కు హితవు పలికారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్