బాబు విషయంలో బీజేపీ కీలక డెసిషన్

BJP is a key decision in the case of Chandra Babu

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ తో ముందుకు వెళ్లాలి అంటే మరో 20 ఏళ్లు అయినా ఆ పార్టీ ఎంపీల స్ధానం 80 దాటదు, ఇది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ, మిత్ర పక్షాలు అన్నీ కలిపితే 100 నుంచి 120 మధ్య ఆగిపోతుంది మినహా అధికారంలోకి రాదు. ఇక బీజేపీ మరో పదేళ్లు ఇలాగే ప్రజల మనసులు గెలిస్తే అధికారంలో ఉంటుంది..ఎలాగో మోదీ చెప్పారు తాను రెండు సార్లు పీఎంగా ఉంటాను ఇక ఉండను అని, ఆ తర్వాత అమిత్ షాకు ఆ పదవి ఇచ్చే ఆలోచనలో ఉంది బీజేపీ.. అందుకే ఆయన చేతికి పార్టీ కీలక పగ్గాలు శాఖలు మంత్రిగా అప్పగించారు. హోంశాఖ ఎవరు చేసినా కీలక నేతలు అనేది గుర్తించాలి.

సో తమకు వైరి వర్గంగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎలాగైనా బలోపేతం అవ్వాలి అని ప్లాన్ లో ఉంది.. అందుకే బీజేపీ చాలా క్లోజ్ గా పొలిటికల్ ప్లాన్ వేస్తోంది. ముఖ్యంగా అమిత్ షానే ఇక రాజకీయంగా పార్టీని చూస్తున్నారు.. మోదీ పాలనపై దృష్టిపెట్టారు. అయితే ఏపీలో జగన్ కు సాయం చేస్తూనే ఇక్కడ ఏపీలో కమలం మరింత వికసించాలి అని ప్రణాళిక వేస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు కమళ దళం ఆలోచన ఇదే. ఎందుకు అంటే వైసీపీకి సాయం చేస్తున్నా ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నా ఇక్కడ బీజేపీ త్వరలో ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చూస్తోంది. ఇప్పటికే నాలుగు పార్లమెంట్ స్ధానాలు బీజేపీ తెలంగాణలో గెలుచుకుంది. ఇక ఏపీలో గతంలో గెలుచుకున్న స్ధానాలు కూడా గెలుచుకోలేదు.

అందుకే ఇక్కడ సొంతంగా బలంగా పాతుకుపోవాలి అని బీజేపీ చూస్తోంది. ఈ సమయంలో ఏపీలో చాలా మంది నేతలతో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. బాబు పార్టీలో చాలా మంది నేతలు ఇక తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లడం కష్టం అని బీజేపీలో చేరాలి అని చూస్తున్నారు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇప్పటికే పార్టీలో ఎవరైనా చేరినా ఆహ్వనం పలికేందుకు సిద్దంగా ఉన్నారు.. ఇప్పటికే జనసేన నుంచి రావెల రాజీనామా చేసి, మోదీ తిరుమల వచ్చిన సమయంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఇక తెలుగుదేశం నుంచి అనంతపురం కడప కర్నూలు జిల్లాకు చెందిన నేతలు కూడా బాబుకు గుడ్ బై చెప్పాలి అని చూస్తున్నారు. బీజేపీలో వారికి స్ధానం ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ ఐదు సంవత్సరాలు బీజేపీ భజన చేస్తే కచ్చితంగా తమకు సీటు ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అని భావిస్తున్నారు. మరి కమలంలో ఎవరు ఎలా ప్రకాశిస్తారో వికసిస్తారో చూడాలి.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.