బాబు పై బీజేపీ కొత్త వ్యూహం?
తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది.. ఇక కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన రోజే తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వస్తారు అని అనుకున్నారు.. కేంద్రం తెలుగుదేశం పై ఎటువంటి ఆలోచన చేయకపోవడం ఏపీకి సానుకూలంగా లేకపోవడంతో తెలుగుదేశం కేంద్రం నుంచి బయటకు వచ్చాము అని చెబుతున్నారు.. ఇక తెలుగుదేశం పరిస్దితి ఇలా ఉంటే, రాష్ట్రంలో బీజేపీ కూడా ఎదుగుదల విషయంలో ఎటువంటి ఆలోచన చేయడం లేదు.. ఇటు బీజేపీ ఆలోచన ఒకటే, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా మళ్లీ మన దగ్గరకు మిత్రపక్షంగా రావాల్సిందే అన్న ఆలోచనలో ఉంది బీజేపీ.
ఇక బీజేపీ నాయకులు కూడా ఏపీకి ఎటువంటి న్యాయం చేయకపోతే కేంద్రంలో ఈ నాలుగు సంవత్సరాలు ఎలా కలిసి ఉన్నారు ఎన్నిచేసినా ఏమీ చేయలేదు అనేలా కామెంట్లు చేస్తున్నారు అని అనడం వెనుక, పొలిటికల్ డ్రామాలు ఏమిటి అని ఫైర్ అవుతున్నారు రాష్ట్ర కమలం నాయకులు.. దీనిపై తెలుగుదేశాన్ని సెంటర్ చేస్తున్నారు.
చంద్రబాబు కుట్రలు, మోసాలు, అవినీతిని త్వరలోనే బయటపెడతామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఢిల్లీలో చెప్పడం విశేషం.
ఇక బీజేపీ కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ఏపీకి ఎటువంటి నిధులు ఇచ్చామో తెలియచేయాలని ఆలోచిస్తోంది.. తెలుగుదేశం అవినీతి పై కరపత్రాలు ప్రచురించాలి అని ఆలోచిస్తోంది…ఓటమి భయంతోనే తెలుగుదేశం బీజేపీ పై విమర్శలు చేస్తోంది అని బీజేపీ తెలుగుదేశానికి కౌంటర్ ఇస్తోంది. 29 సార్లు సీఎం మోదీని కలిస్తే ఆయన ఏమీ చర్చించారు అని అడుగుతున్నారు బీజేపీ నాయకులు. ఇక 29 సార్లు ప్రధానిని కలిస్తే ఏపీకి ఎందుకు ప్రధాని న్యాయం చేయలేదు,మీరు నియోజకవర్గాలు పెంచాలి ఇలాంటి వి ఏవో అడిగి ఉంటారు అనిప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి బీజేపీ తెలుగుదేశాన్ని రాష్ట్రంలో ఎదుర్కొంటాము అని చెబుతోంది… అలాగే తమకు ఎటువంటి ప్రత్నామ్నాయం అక్కర్లేదు అని, మోదీ అభివృద్ది మంత్రంతో ముందుకు వెళతామని, కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి ప్రభుత్వాన్ని మరలా ఎవరూ కోరుకోవడం లేదు అని బీజేపీ అంటోంది.. ఇక తెలుగుదేశం అక్రమాలు అన్యాయాలు అన్నీ ఏపీలో ఉన్న బీజేపీ నాయకులు బయటపెడతారని అంటున్నారు… మరి తెలుగుదేశం ఎటువంటి ఎత్తుపల్లాలు రాజకీయంగా చూస్తుందో చూడాలి.
Latest Updates
- పార్టీ మార్పుపై జేసీ వారసుడు క్లారిటీ
- జగన్ పై విజయశాంతి ప్రశంసలు
- కృష్ణా జిల్లాలో జగన్ మాస్టర్ ప్లాన్ అదిరింది
- మరో కీలక పదవి స్వీకరించిన సీఎం జగన్
- గన్నవరంలో సరికొత్త ఫార్ములా – జగన్
- స్పీకర్ వర్సెస్ చంద్రబాబు ఎవరూ భయపడరిక్క
- టీడీపీ నేతలని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి – జగన్
- చంద్రబాబు అత్తగారికి పదవి ఇచ్చాము జగన్
- పవన్ కు షాకిస్తూ జగన్ కు జై కొట్టిన ఎమ్మెల్యే
- అసెంబ్లీలో వీడియో చూపించి బాబు పరువు తీసిన కొడాలి నాని
- జగన్ గారు మాకు ఆ కంపెనీకి సంబంధం లేదు – నారా భువనేశ్వరి
- వీరిద్దరిలో ఎవరి నవ్వు నిజాయితీగా అనిపిస్తుంది
- పార్టీ మార్పుపై గొట్టిపాటి క్లారిటీ
- జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు