janampulse

కేంద్రం పేద‌ల‌కు వ‌రాలు ఎవ‌రికి ఏం వ‌రాలో చూడండి

central government announced corona financial package

క‌రోనాతో దేశంలో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తం అయింది. మ‌న దేశం మొత్తం ఏప్రిల్ 14 వ‌ర‌కూ లాక్ డౌన్ విధించారు. ఈ స‌మ‌యంలో వలస పోతున్న శ్రామిక జీవులను, రోజువారీ కూలీలను , చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తెలిపారు

దేశ ప్ర‌జ‌ల‌కు లక్షా 70 వేల కోట్లతో భారీ ఎకనామిక్ ప్యాకేజీని అమలు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఫుడ్ స్కీమ్ ఫర్ 80 క్రోర్ పూర్ అనే పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా 80 కోట్ల మంది పేదలకు ఈ పథకం కింద ఆహారం అందుతుంది.

పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరిన్ని పథకాలను ప్రకటించారు వచ్ఛే మూడు నెలలకు గాను పేదలకు ఉచితంగా.. అదనంగా 5 కేజీల గోధుమపిండి, బియ్యం, పప్పులు ఇవ్వ‌నున్నారు.. దేశంలో కరోనా రోగుల సేవలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు దేశంలో.

జన్ ధన్ ఖాతాలు కలిగిన మహిళలకు నెలకు 500 రూపాయల ఎక్స్-గ్రేషియా అందుతుందని, రైతులకు రూ. 6 వేల తొలి విడత చెల్లింపులు జరుగుతాయని ఆమె తెలిపారు. ప్రత్యేకంగా దేశంలోని 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.. దేశంలో స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ. 10 లక్షలకు పెంచుతున్నాం అన్నారు..

ఉపాధి హామీ వేతనాలను రూ. 182 నుంచి రూ. 202 కు పెంచారు, రూ. 15 వేల లోపు వేతనం పొందుతున్నవారికి ఈ పీ ఎఫ్ ఫండ్ ను కేంద్రమే భరిస్తుందని ఆమె వివరించారు. మూడు కోట్ల మంది వితంతువులకు పెన్షనర్లకు, దివ్యంగులకు వెయ్యి రూపాయల చొప్పున ఎక్స్-గ్రేషియా అందుతుందని తెలిపారు. బీపీఎల్ కింద ఉన్న 8.3 కోట్ల కుటుంబాలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని నిర్మల వెల్లడించారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.