
బ్రేకింగ్ వాహనదారులకు కేంద్రం శుభవార్త
కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో అంతకంతకూ పెరుగుతూనే ఉంది, ఈ సమయంలో 21 రోజుల లాక్ డౌన్ తో ఎక్కడ వారు అక్కడే ఉన్నారు.. దాదాపు కోట్లాదిమందికి ఉపాధి లేదు అన్నీ షట్ డౌన్ లోనే ఉన్నాయి, కూలీవాడి నుంచి కోటీశ్వరుడు వరకూ గడపదాటడానికి లేదు, అందుకే ప్రభుత్వం కూడా పేదలకు సాయం చేస్తోంది.
Also Read జగన్ నిర్ణయం బాగుంది – యనమల
ఇక మారిటోరియం విధించి పలు బ్యాంకుల ద్వారా ఈఎంఐలు కట్టేవారికి కాస్త ఉపశమనం ఇస్తోంది, తాజాగా ఈ సమయంలో కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది.డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్ 30 వరకూ పొడగిస్తూ కేంద్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 23 కోట్ల మంది వాహన యజమానులు, 1.2 కోట్ల వాహనాలకు భారీ ఊరట లభించినట్టయ్యింది. లాక్‌డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడా రవాణా శాఖ కార్యాలయాలు లేవు..
దీంతో ఎక్కడకు వెళ్లినా వారి వాహనాలకు ఇబ్బంది కలుగుతోంది.. అందుకే తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 31తో గడువు ముగిసిపోయే డ్రైవింగ్ లైసెన్స్‌లు, స్టేట్ లేదా నేషనల్ పర్మిట్లు, వాహన ఫిట్‌నెస్ పరీక్షలను జూన్ 30వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
ఇలాంటి వాహనాలకు ఇక ఎవరూ అడ్డుకోరని సరైన పత్రాలు కచ్చితంగా చూపించాలి అని తెలిపింది కేంద్రం…ఫిబ్రవరి 1, 2020 నాటికి గడువు ముగిసిన పత్రాలను జూన్ 30,2020 వరకు చెల్లుబాటు అయ్యేలా అమలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కేంద్రం సూచించింది. సో ఇక వాహనదారులు ఎవరూ కంగారు పడవలసిన పనిలేదు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్