
గ్యాస్ సబ్సిడీ ఫై కేంద్రం కీలక నిర్ణయం
వంట గ్యాస్ సబ్సిడీ రాయితీ లేదని వస్తున్న రూమర్స్ ఫై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఖండించారు.ఆ వార్త ఫై ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేసారు.పేదలు ఉపయోగించే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేది లేదని,రాయితీ కొనసాగుతుందని,సామాన్య ప్రజలు వినియోగించే గ్యాస్, కిరోసిన్ సబ్సిడీ కొనసాగుతుంది అని మంత్రి ధర్మేంద్రప్రధాన్ అన్నారు.త్రిపుర రాజధాని అగర్త వేదికగా జరిగిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కార్యక్రమంలో 20 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలోనే వంట గ్యాస్ సబ్సిడీ ఆయన మాట్లాడారు.రాష్ట్రాల్లో గ్యాస్ కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ నుంచి త్రిపుర వరకు పైప్‌లైన్లు వేస్తామని తెలిపారు.అలాగే పశ్చిమ్‌బంగలోని సిలిగురి నుంచి బంగ్లాదేశ్ పర్వతీపూర్‌కు డీజిల్ సరఫరాకు పైప్‌లైన్ వేయనున్నట్టు తెలిపారు.సబ్సిడీపై అందించే వంట గ్యాస్ సిలిండర్లపై రాయితీని తొలగిస్తామని ఇటీవల కేంద్రం లోక్‌సభలో వెల్లడించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అర్హత ఉన్న కుటుంబాల ఏడాదికి 12 సబ్సిడీ సిలిండర్లను పొందుతున్నాయి. ఆ సంఖ్య దాటితే మార్కెట్ ధర పెట్టి సిలిండర్ ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర రూ.564 గా ఉండగా, సబ్సిడీ సిలిండర్ రూ.477 లకు దొరుకుతోంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్