మాగంటి బాబు ఎక్కడ చంద్రబాబుకు కొత్త టెన్షన్

ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ బండి ముందుకు కదలడం లేదు, పార్టీ పెట్టిన సమయం నుంచి ఇప్పటి వరకూ ఎన్నడూ రాని ఫలితాలు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి, అయితే మరో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండలేక కొందరు మూటా ముల్లు సర్దుకుంటున్నారు. మరికొందరు గోడ మీద పిల్లిలా ఆటలు ఆడుతున్నారు. పొమ్మన లేక పొగబెడతారా అంటూ మరికొందరు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వల్లభనేని వంశీ ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అంటే పార్టీ పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అఙ్ఞాతంలోకి వెళ్ళిపోగా.. విశాఖతీరంలో గంటా రాజకీయం గుట్టుగానే సాగుతోంది. ఇంతలో మరో నేత అఙ్ఞాతంలోకి వెళ్ళిపోవడం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని అయోమయానికి గురిచేస్తోంది. మరి ఆయన ఎవరు అంటే ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అని చెప్పాలి, మాగంటి వారి వంశం అంటే రాజకీయాల వంశం అని చెప్పాలి, మాగంటి బాబు అలియాస్ వెంకటేశ్వరరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సైలెంట్ అయ్యారు, అంతేకాదు ఆయన అఙ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటున్నారు సొంత పార్టీ నేతలు.
ఇటీవల చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఏలూరుకు వచ్చినా మాగంటి మచ్చుకైనా కనిపించలేదు. దీంతో ఈ వార్త జిల్లాలోనే కాదు స్టేట్ లోనే వైరల్ అవుతోంది.

మాగంటి వెంకటేశ్వరరావు తల్లి, తండ్రి గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. మాగంటి బాబు కూడాగతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. ఈ క్రమంలోనే 2014లో ఏలూరు ఎంపీ స్థానానికి పోటీచేసి ఎంపీగా అయిదేళ్ళు కొనసాగారు.
కాని గుర్తింపు రాలేదు, ఇక 2019లో సీటు ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. చింతలపూడి నియోజకవర్గంలో ఓ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పోస్టు తన వర్గానికి ఇప్పించుకోవడంలో విఫలయత్నం చేసిన మాగంటి బాబు తన మాట నెగ్గకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా పార్టీలో ఐదు సంవత్సరాలు ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఆయన పార్టీ ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు, గతంలో మాజీ మంత్రి పీతల సుజాత వ్యవహారంలో తనకు ప్రయారిటీ ఇవ్వకుండా బాబు ఆమెకు ప్రయారిటీ ఇష్తున్నారు అని సన్నిహితులతో వాపోయారు.

ఇన ఆయన కుమారుడు రామ్జీని రాజకీయాల్లో యాక్టివ్ చేసే వరకైనా బాబు యాక్టివ్గా వుంటారని ఆయన అనుచర వర్గం భావించింది. కాని ఆయన మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకు ఎంతో సన్నిహితుడైన చింతమనేని జైల్లో ఉన్నా ఆయనని కూడా పరామర్శించలేదు. మరి మాగంటి బాబు ఎక్కడా అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశమైంది, ఆయన టీడీపీ దూరంగా ఉండటం వెనుక, వైసీపీ లేదా బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే కొత్త ఆలోచనలు వస్తున్నాయి ప్రజలకు.

విశ్లేషణ-వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.