janampulse

చంద్రబాబు యాత్ర అట్టర్‌ ప్లాప్..!! – రెచ్చగొట్టే ప్రసంగాలకే బాబు పరిమితం..!

Chandra babu praja chaitanya yatra utter flop

చంద్రబాబు ప్రజావంచన యాత్ర మొదలైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మరోసాని తన అబద్ధపు ప్రసంగాలతో మోసగించడానికి చంద్రబాబు బయల్దేరారు. తెలుగుదేశం పార్టీకి కాస్తోకూస్తో బలమున్న ప్రాంతం ప్రకాశం జల్లా మార్డూర్‌ . ఇక్కడ నుంచే చంద్రబాబు తన ప్రజావంచన యాత్రను మొదలు పెట్టారు. వారం రోజుల నుంచి చుట్టపక్కల జిల్లాల నేతలు జన సమీకరణ చేస్తున్నారు. వారం రోజులుగా జనసమీకరణ చేస్తే చంద్రబాబు ప్రజావంచన ప్రారంభ సభకు 5వేల మంది కూడా రాలేదు. వీరిని చూస్తూ చంద్రబాబు ఊగిపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలారు. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. ఆంబోతు, దున్నపోతు అంటూ నాలుకకు నరంలేకుండా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలను విమర్శిస్తే అట్రాసిటీ కేసు పెడతారా? నేను అంటా నాపై కూడా కేసు పెడతారా?. అంటూ చంద్రబాబు రెచ్చిపోయారు. ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్ధం లేకుండా చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. వారం రోజుల నుంచి జన సమీకరణ చేస్తున్నా ప్రజలు రాలేదు. దీంతో టీడీపీ నేతల్లో తీవ్ర అసహనం కనిపించింది. చంద్రబాబు తమ కోసం కాదు, తన ఆస్తులు అమరావతిలో కాపాడుకోవడానికే యాత్ర చేపట్టారని ప్రజలు త్వరగానే అర్ధం చేసుకున్నట్లు కనిపించింది. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పచ్చ నోట్లకు కూలీ వచ్చిన వాళ్లు తప్పిస్తే ఎవరూ అరవలేదు. చంద్రబాబు యాత్ర సాగిన రోడ్లు ఖాళీగా కనిపించాయి.ఎల్లో మీడియా కెమెరాలు ఎన్ని క్లోజ్‌ షాట్‌లు పెట్టినా కవర్‌ చేయలేకపోయాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అనే గౌరవం కూడా లేకుండా చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. మాటిమాటికి తుగ్లక్‌ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ఆంబోతులు, దున్నపోతులు అంటూ ప్రభుత్వ పెద్దలపై చంద్రబాబు నోరుపారేసుకున్నారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా?!!. అనుభవం నడవడికను, మాట్లాడే విధానాన్ని నేర్పాలి చంద్రబాబు మాత్రం తన అనుభవంతో పొలిటికల్ క్రైమ్‌ను పెంచి పోషిస్తున్నారని అనిపిస్తోంది. మార్టూర్‌లో చంద్రబాబు ప్రసంగం వింటుంటే కరోనా వైరస్‌ వస్తే అరిచేవారిలా అరుస్తున్నాడని అనిపించింది. కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరమైనది ఎల్లో వైరస్‌ అన్నట్లు చంద్రబాబు ప్రసంగించారు. ఒక పక్క రెచ్చగొట్టే ప్రసంగం చేస్తూనే మరో పక్క మహాత్మాగాంధీ అహింస సిద్దాంతం కావాలంటాడు. చంద్రబాబు స్పీచ్‌కు మహాత్మాగాంధీకి ఎక్కడా కూడా లింక్‌ కుదరలేదు అయినా..మహాత్మా గాంధీ పేరును వాడేసుకున్నాడు . మామ ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచి..ఆయన సీట్ లాక్కుని, ఆయన పార్టీ లాక్కుని ప్రజల్లోకి వచ్చి ఎన్టీఆర్ గురించి మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది.చంద్రబాబు ఓ రాజకీయ అరాచకవాది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.

మార్టూర్ సభతో టీడీపీ నేతలు డీలా పడ్డారు. అనుకున్నంతలో 5 శాతం జనం కూడా రాకపోవడంతో టీడీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ నేతలు మార్టూర్ సభ తరువాత ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ పక్క అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు. మరోపక్క ఐటీ దాడుల ఉచ్చు. ఇవన్నీ ప్రజలు కళ్లారా చూస్తున్నారు.ఎల్లో మీడియా మసిపూసి మారేడు కాయ చేయాలని చూసినా ప్రజలు నమ్మడం లేదు. ఈ విషయం టీడీపీ నేతలకు కూడా అర్ధమైంది. దీంతో బాబు యాత్రకు డబ్బులు పెట్గి, వెంట తిరగడం వేస్ట్ అని టీడీపీ జిల్లా స్థాయి నేతలు ఓ అంచనాకు వచ్చారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనపై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారే కాని జిల్తా స్థాయి టీడీపీ నేతలు అంతగా విమర్శలు చేయడంలేదు. గ్రౌండ్ రియాల్టీస్‌ జిల్లా స్థాయి నేతలకు తెలుసు. 9 నెలల పాలనలో వైఎస్‌ జగన్‌ పనితీరు ప్రజలకే కాదు, టీడీపీ నేతలకు కూడా అర్ధమైంది. ఆర్ధికంగా అధోపాతళంలో ఉన్న రాష్ట్రాన్ని కోలుకునేలా చేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామాల అభివృద్దిలో సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పింఛన్లు ఇళ్ల గడప తొక్కుతున్నాయి. అమ్మ ఒడి, గోరుముద్ద , ఇంగ్లిష్ మీడియం విద్యావ్యవస్థలో సంస్కరణలు రేపటి తరానికి బంగారు బాటలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా జిల్లా స్థాయి టీడీపీ నేతలు గమనిస్తున్నారు. అందుకే..చంద్రబాబు విమర్శలు చేయమన్నట్లు జగన్ ప్రభుత్వంపై మాటలు దాడి చేయడం లేదు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసేవకుడిగా ముందుకెళ్తున్నాడని టీడీపీ నేతలే చెబుతున్నారు. అందుకే..చంద్రబాబు యాత్రకు స్పందన అంతంతమాత్రంగానే ఉందని టీడీపీ నేతలే స్వయంగా చెబుతున్నారు.

చంద్రబాబు ఎంత చించుకున్న ప్రజలకు వాస్లవాలు తెలుసని ఓ టీడీపీ మిత్రుడు నాతో అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అమరావతిని వదిలి రియల్ గా థింక్ చేయాలని ఈ టీడీపీ మిత్రుడు అభిప్రాయపడ్డాడు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కూడా అపకీర్తిని మూట కట్టుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో తిరిగితే ప్రజలు ఛీత్కరించుకుంటారని టీడీపీ నేతలే చెబుతున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.