చంద్రబాబుకు ఇద్దరు ఐఏఎస్ లు ఝలక్

Chandrababu has two IAS shock

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తాడా అనే టెన్షన్ చంద్రబాబుకు మరింత పెరిగిపోయింది.. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ఎవరి నుంచి ముంచుకువస్తుందా అని బాధమరో పక్క, ఎన్నికల్లో ఓటమి చెందిన తెలుగుదేశం నావని లోకేష్ నడుపుతాడా అంటే, అది కష్టం పైగా ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా చంద్రబాబు తనయుడ్ని రాజకీయాల్లో కొనసాగేలా చేస్తున్నారు అని వైసీపీ విమర్శలకు సిద్దం అవుతోంది. చినబాబు రాకకై వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు అనేది తెలుగుదేశం నేతలు కూడా చర్చించుకుంటున్నారు.

అయితే ఇటీవల జగన్ చేసిన కొన్ని కామెంట్లు పెద్ద ఎత్తున టీడీపీ కుర్చీలను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ అని అనుకుంటున్నారా? గత ప్రభుత్వం లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అవినీతి అంతా బయటపెడతా, ఆ కాంట్రాక్టులు రద్దు చేసి రివర్స టెండరింగ్ విధానం తెస్తా, జ్యూడిషియల్ కమిటీ వేస్తాను అని చెబుతున్నారు సీఎం జగన్.. ఇంత వరకూ బాగానే ఉంది .ఇది అందరూ హర్షించేది, పైగా ఏ రాష్ట్రం కూడా ఇంత సాహసం చేయలేదు, నిజంగా జగన్ చేస్తున్నాడు కాబట్టి అందరూ మంచి పని అని అంటున్నారు.

కాని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు మరో విషయం మాత్రం బాగా వేదన కలిగిస్తోంది.. ఎవరైనా సరే అధికారులు గత ప్రభుత్వంలో పలానా అవినీతి జరిగింది అని తన ముందుకు రిపోర్టు పక్కాగా తీసుకువస్తే, సన్మానం చేస్తా పైగా వారికి ప్రమోషన్ ఇస్తా అంటున్నారు సీఎం జగన్..దీని వల్ల ఏపీ ఖజానాకు లాభం, పైగా పారదర్శకత ఎంత ఉందో తెలుస్తుంది. జగన్ నిజాయతీకి నిదర్శనం అవుతుంది, ఈ పాలన అవినీతి లేని పాలన అని జగన్ కు మంచి పేరు వస్తుంది.

కాని గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తే? అసలే మునిగిపోతున్న పడవను కాపాడేవారు ఉండరు, పైగా జగన్ ఇలా అన్నారో లేదో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు రాత్రి పగలు కూడా గతంలో జరిగిన అవినీతి గురించి పక్కా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారట.. పైగా పెద్ద శాఖల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, ఈ రిపోర్టులు జగన్ దగ్గరకు త్వరలో ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారట. మోత్తానిక పాపం ఎంతో కాలం నిలవదు, అన్యాయాలు ఎప్పటికైనా బయటపడతాయి అని అంటున్నారు వైసీపీ శ్రేణులు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.