చంద్రబాబు ఇంటికెళ్లే రోడ్డు తొలగింపు

Chandrababu house Road Removal

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇల్లూ అక్రమ కట్టడమే అంటున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. పేద రైతుల పొలాలు ఆక్రమించి.. చంద్రబాబు ఇంటికి రోడ్డు వేశారని స్పష్టం చేశారు. ఆయన నివాసానికి వెళ్లే రోడ్లను కూడా తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రధాన రోడ్లతోపాటు ఆయన నివాసానికి వెళ్లే రోడ్డు కూడా తీసేస్తామని వెల్లడించారు ఎమ్మెల్యే. ఈమేరకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 

ప్రజావేదికకు దగ్గర్లోనే ఉన్న LEPL గెస్ట్ హౌస్ లో మాజీ సీఎం చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా నివాసం ఉంటున్నారు. పూర్తిగా నది గర్భంలోకి వెళ్లి ఈ అతిధి గృహాన్ని నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేవు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేశారు. దీన్ని తీసివేయాలని గతంలోనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించలేదు. 2014 నుంచి చంద్రబాబు సీఎం హోదాలో ఈ గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నారు.

లింగమనేని గెస్ట్ హౌస్ కు ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చారు. పూర్తిగా అక్రమ కట్టడమని.. దాన్ని కూడా తీసేస్తామని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉంటున్న ఇంటికీ, ప్రజావేదికకు వెళ్లేందుకు వేసిన 40 అడుగుల రోడ్డును తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఈ రోడ్డును వేశారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ లో భాగంగా తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చామని.. ప్రజావేదికను తొలగించారు కాబట్టి తమ భూములను ఇవ్వాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు ఎమ్మెల్యే. రైతుల న్యాయబద్ధమైన డిమాండ్ ను పరిశీలిస్తామని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన నోటీసులను కూడా రైతులు రామకృష్ణారెడ్డికి ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారాయన.

చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ ను ఇప్పటికిప్పుడు కూల్చకపోయినా.. ఆయన ఇంటికెళ్లే రోడ్డును మాత్రం తొలగించటం జరుగుతుంది. అప్పుడు ఇంటికి వెళ్లే దారి మూసుకుపోతుంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దారి లేకుండా ఆయన ఇంట్లో నుంచి బయటకు ఎలా వస్తారు.. మళ్లీ ఇంట్లోకి ఎలా వెళతారు అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. చంద్రబాబు కూడా గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్లిపోతారనే ప్రచారం కూడా జరుగుతుంది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.