నారాలోకేష్ కు చంద్రబాబు కీలక పదవి

Chandrababu is the key role to Nara lokesh

రాజకీయాల్లో చూచి రాతలు కాపీకొట్టడాలు ఉండవు, కాని తెలంగాణలో ఉన్న పథకాలు ఏపీలోకి తీసుకురావడం అలాగే జగన్ చెప్పే నవరత్నాల హామీలు చంద్రన్న హామీలుగా చేయడం అన్నీ చంద్రబాబు పాలనలో కనిపించేవి అయితే తెలంగాణ రాజకీయాలు ఏపీలో కనిపించేవి సేమ్ చంద్రబాబు కేసీఆర్ అక్కడ ఏం చేస్తే ఇక్కడ అదే పేరున చేసేవారు అనే అపకీర్తి మూటగట్టుకున్నారు. ఇక కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఆ తర్వాత కేబినెట్లోకి తీసుకుని పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది.

ఇక్కడ ఏపీలో కూడా చంద్రబాబు తన కుమారుడిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ చూసే శాఖలు ఏమైతే ఉన్నాయో అవే శాఖలు ఏపీలో కూడా ఇచ్చారు. ఇలా కేసీఆర్ అడుగులు చూసి చంద్రబాబు అడుగులు వేసేవారు. ప్రతీ ఒక్కరూ దీని గురించే చర్చించుకునేవారు .అక్కడ కేటీఆర్ ఎలాంటి శాఖలు చూస్తున్నారో ఇక్కడ కూడా అవే శాఖలు ఇచ్చారు చంద్రబాబు. ఇక ఈ సారి ఎన్నికల్లో దారుణమై పరాభవం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది తెలుగుదేశం.

అయితే ఎమ్మెల్సీగా రాజీనామా చేయకపోవడంతో చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారాలోకేష్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక ఈ సమయంలో ఏపీలో తెలుగుదేశం బాధ్యతలు చంద్రబాబు చూస్తారా లేదా తనయుడికి రాజకీయాలతో పాటు పార్టీని అప్పగిస్తారా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమితులయ్యారు, అందుకే ఏపీలో కూడా నారాలోకేష్ కు కీలక పదవి పార్టీలో ఇవ్వాలి అని పార్టీ కేడర్ కోరుకుంటోందట.

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను నియమించేందుకు రంగం సిద్ధం అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్. కాబట్టి లోకేష్ ను కూడా టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు చంద్రబాబు.
అయితే చాలా మంది సీనియర్లు చెప్పేమాట ఇదే, అసలు ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇలాంటి పదవి లేదు, మరి ఎందుకు ఈ పదవి అనేది సీనియర్లు ఆలోచిస్తున్నారు. లోకేష్ కోసం దీనిని సృష్టిస్తున్నారు అని తెలుస్తోంది.

ఇక టీడీపీలో దీనిపై కొందరు గుర్రుగా ఉన్నారట.. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి కొడుకుని ఎమ్మెల్సీ మంత్రిని చేస్తే ఎవరూ ఏమీ అనలేదు.. కాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది పార్టీ, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెబుతున్నారట. ఇప్పటికే లోకేష్ ప్రసంగాల వల్ల మాటల జారుడు వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని, పార్టీ పగ్గాలు ఇప్పుడు లోకేష కు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఏపీలో ఉండదు అని చెబుతున్నారట. కేటీఆర్ కు లోకేష్ కు చాలా తేడా ఉంది. రెండు సార్లు కేటీఆర్ అక్కడ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఇక్కడ లోకేష్ ఓటమి పాలయ్యాడు. ఇక్కడ లోకేష్ కు ఈ పదవి ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారట.. అందుకే సీనియర్లను బుజ్జగించి చినబాబుకి లైన్ క్లియర్ చేసేందుకు చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారట.. సో త్వరలో చినబాబుకి పార్టీ పగ్గాలు అదించడం ఖాయం అనేది పసుపు దళం నుంచి వినిపిస్తున్న గుసగుస.

విశ్లేషణ- వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.