టీడీపీ నేతలకు చంద్రబాబు పసుపు జ్యూస్

Chandrababu yellow juice for TDP leaders

ఫలితాల డేట్ దగ్గర పడుతున్న సమయంలో ఇటు రాజకీయంగా ఏపీలో మూడు పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. గెలుపు ఎవరికి వస్తుంది అనే విషయంలో ఆలోచనలు ఎవరివి వారివిగా ఉన్నాయి.. ఇంకా ఫలితాలకు 8 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక అభ్యర్దులు గెలుపు ఎవరికి వస్తుంది అని టెన్షన్ పడుతున్నారు.. ఓ పక్క సర్వేలు అన్నీ జగన్ సీఎం అని చెబుతున్నాయి. మరో పక్క తెలుగుదేశం అభ్యర్దులకు ఈ సర్వేల గోల ఎక్కువ అయింది, ఎక్కడా కూడా మన పార్టీ గెలుస్తుంది అని మాట వరసకు కూడా ఎవరు అనడం లేదు అనే బాధ చెప్పలేనంత పెరిగిపోయింది.

ఇక చంద్రబాబు అయితే తమదే గెలుపు తీన్మార్ కు రెడీ అవ్వండి అనేలా నేతలకు మంచి దైర్యం పోస్తున్నారు.. ఇటు లోకేష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.. అసలు మంగళగిరి పొజిషన్ ఏమిటి అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు, వాస్తవంగా చెప్పాలి అంటే చంద్రబాబుకు కుప్పం కంటే మంగళగిరిపై ఆలోచన పెరిగిపోయింది. అక్కడ రిజల్ట్ ఎలా వస్తుంది అని టెన్షన్ పెరిగిపోయింది. ఇక తాము గెలుస్తామా డ్యాష్ బోర్డ్ సర్వే ఏమిటి? ఇలా ప్రతీ ఒక్క పార్టీ నేత ఆలోచన చేస్తున్నారు.. ఈకొత్త ఆలోచనలతో మీడియా కూడా నెగిటీవ్ వార్తలు ప్రచారం చేస్తోందా అనే టెన్షన్ పార్టీ నేతలకు పెరిగిపోయింది.

మొత్తానికి సమీక్ష సమావేశాల్లో మాత్రం మనం తప్పకుండా గెలుస్తాం అని చెబుతున్నారు చంద్రబాబు. అయితే మీటింగ్ అయిన ప్రతీ వారికి ఇదే చెప్పడంతో ఇదేంటి విచిత్రంగా ఈసారి మనం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ సీట్లు గెలుస్తామా అనే ఆలోచన వస్తోంది.. మొత్తానికి చంద్రబాబు తీసుకున్న సర్వే రిపోర్టులు ఏం చెబుతున్నాయి అనేది సీనియర్ నేతలకు కూడా తెలియదట. తమ సంక్షేమపథకాలు గెలిపిస్తాయి అనిపసుపు జ్యూస్ ఇస్తున్నారు నేతలకు చంద్రబాబు, కాని నాయకులు మాత్రం అది తాగడానికి అంత ఆసక్తి చూపించడం లేదట.. చూడాలి మరి 8 రోజులు ఇంకెంతమంది ఈ పసుపు జ్యూస్ తాగుతారో, వాస్తవంగా సర్వేలు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే పక్కాగా క్లారిటీ వస్తుంది అని 19 వరకూ వెయిట్ చేద్దాం అంటున్నారు మూడు పార్టీలనేతలు. మనం కూడా చూద్దాం.

విశ్లేషణ- వీజీ

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.