మావోలకు గిరిజనులకు సీఎం గుడ్ న్యూస్

CM Jagan Good news for Mao and tribals

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అద్భుతాలు అని చెబుతున్నారు వైసీపీ నేతలు, ముఖ్యంగా ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలుగా చేయని పనులు కూడా జగన్ సీఎం అయిన తర్వాత చేస్తున్నారు .అందుకే ఆయన పాలన భేష్ అని ప్రజలు కూడా నేరుగా అంటున్నారు. ఇక కేబినెట్ భేటీ నుంచి ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. అతని స్పీడ్ చూసి సాటి మంత్రులు సైతం ముక్కుమీద వేలేసుకుంటున్నారు, సీఎం తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే ఎదో ఆషామాషిగా తీసుకున్నట్లు అనిపించటం లేదు. వాటి మీద ముందు నుండే కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. బాధ్యతలు చేపట్టిన మొదటిరోజు నుండి ఆయన తీసుకున్న నిర్ణయాలు వేటికవే ప్రత్యేకం.

ఇక పిల్లలను ప్రభుత్వ స్కూల్ కు పంపాలి అంటే భయపడేవారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ స్కూల్స్ లో అడ్మిషన్లు లేవు అని అంటున్నారు.
ముఖ్యంగా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయటం కావచ్చు, ఇసుకని ఆన్ లైన్ లో అమ్మటం, పోలీసులకి వీక్లీ ఆఫ్ ఇవ్వటం, సీఎం గా ప్రమాణస్వీకారం చేయకముందే IAS,IPS లను బదిలీ చేయటం. పిల్లలకు పోషకాలు ఉన్న ఆహారం మధ్యాహ్న భోజనం అందించడం.. ఇప్పుడు
తాజాగా ప్రజావేదికను కూల్చివేయటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకునే సంచలన నిర్ణయాలు అని అంటున్నారు. ఇక బాక్సయిట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్నో సంవత్సరాలుగా గిరిజనులు మాత్రం బాక్సయిట్ తవ్వకాలు నిలిపివేయాలి అని కోరుతున్నారు ఈ సమయంలో ఎందుకు వీటిని తవ్వుతున్నారు అని జగన్ ప్రశ్నిస్తున్నారు… . గిరిజనులకు వ్యతిరేకంగా మనం ఇలాంటివి చేస్తే వాళ్ళు మావోయిస్టులకు దగ్గర అయ్యే అవకాశం వుంది, కాబట్టి వెంటనే బాక్సయిట్ తవ్వకాలను ఆపేయండి అంటూ గట్టి ఆదేశాలు ఇచ్చాడు.. అయితే కొందరు మావోలు జగన్ తీసుకున్న నిర్ణయం బాగుంది అని అంటున్నారు. మొత్తానికి మావోయిజం కూడా తగ్గుతుంది అని చెబుతున్నారు నేతలు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.