janampulse
Breaking News

దేశంలో ఆ ఘన‌త సీఎం జ‌గ‌న్ కే ద‌క్కుతుంది

CM Jagan Ke is the country's highest honor

నిజ‌మే ఈ కోవిడ్ తో మ‌ర‌ణం సంభ‌వించ‌కూడ‌దు, ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొంద‌రికి మాత్రం ఈ మ‌హమ్మారి సోకుతోంది, ఈ స‌మ‌యంలో ప్రాణాలు కూడా కొంద‌రు కోల్పోతున్నారు, అయితే కొంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి కూడా ఈ వైర‌స్ సోక‌డంతో, చికిత్స తీసుకుంటున్నారు, తాజాగా ఏపీలో ఈ వైర‌స్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి కూడా సోకింది.

Also Read అది కేవ‌లం చంద్ర‌బాబుకి మాత్ర‌మే తెలిసిన విద్య

అయితే ఈ స‌మ‌యంలో డాక్ట‌ర్లు, పోలీసులు చేసే సేవ వెల‌క‌ట్ట‌లేనిది అని చెప్పాలి, ఈ లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు.

దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్‌సవాంగ్‌ కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయితే మాట‌లే కాదు చేత‌ల‌తో కూడా స‌ర్కారు నిరూపించింది ఏపీలో…. ఇక ఏపీలో ఇష్టం వ‌చ్చిన రీతిన సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారం చేస్తున్న‌వారిని క‌ఠినంగా శిక్షిస్తాం అని కేసులు న‌మోదు చేస్తామ‌ని తెలిపారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.