janampulse

ఈ ఆరు టార్గెట్ పెట్టుకున్న సీఎం జ‌గ‌న్

CM Jagan

ఏపీలో ఓ ప‌క్క విజృంభిస్తున్న కోవిడ్ పై పోరాటం చేస్తూనే, ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తున్నారు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Also Read ఎల్వీ సుబ్రమణ్యంకు జ‌గ‌న్ స‌ర్కార్ వెసులుబాటు

మంత్రి అనిల్ అలాగే ప‌లువురు సీనియ‌ర్ అధికారులు కూడా స‌మావేశంలో పాల్గొన్నారు. నిజ‌మే ఇంది ఎండా కాలం మార్చి ఏప్రిల్ ఈ స‌మ‌యంలో పూర్తిగా ఏదైనా ప్రాజెక్టులు పూర్తి చేయాలి అంటే స‌రైన స‌మ‌యం, కాని ఇప్పుడు లాక్ డౌన్ వ‌ల్ల దాదాపు 40 రోజులుగా ఈ ప‌నులు నిలిచిపోయాయి. ఈ వైర‌స్ నేపథ్యంలో సిమెంటు, స్టీల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో నెల రోజులు అత్యంత కీల‌క‌మైన స‌మ‌యం వృదా అయింది అని అన్నారు..ఇప్పుడిప్పుడే సిమెంటు, స్టీల్‌ సరఫరా మొదలవుతోందన్నారు అధికారులు.. స్పిల్‌వే జూన్‌ నెలాఖరు నాటికి పూర్తిచేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు సీఎం జ‌గ‌న్.. ప్రాజెక్టుల విష‌యంలో ప్ర‌ణాళిక రెడీ చేసుకోవాలి అని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

గత సంవత్సరం గోదావరి వరదల్లో ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్ని శరవేగంతో తరలించాలని అధికారులను ఆదేశించారు. వారికి పునరావాస కార్యక్రమాలు వేగంగా చేపట్టాలన్నారు. పోలవరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్ 2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపైనా కూడా సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ ప్రాజెక్టుల విష‌యంలో పూర్తిస్ధాయి రిపోర్టు అందించాలి అని చెప్పారు, అంతేకాదు అనుకున్న స‌మ‌యానికి ఇవి పూర్తి చేయాలి అని తెలిపారు, 2020లోనే ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారులు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి హామీ ఇచ్చారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.