janampulse

సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ అదిరింది.. ఇక టీడీపీకి చుక్కలే..

jagan

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వెళ్తున్న సీఎం జగన్ మరో మాస్టర్ ప్లాన్ వేశారు. సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నా.. విధానపరమైన నిర్ణయాలకు ప్రతిపక్షం పదే పదే అడ్డుపడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు సూపర్ షాక్ ఇవ్వనున్నారు. ఈ విషయంలో జగన్ యూ టర్న్ తీసుకోబోతున్నా.. అది ప్రభుత్వానికి రైట్ టర్న్ అవబోతోంది.

మూడు రాజధానుల బిల్లులను శాసన మండలి అడ్డుకోవడంతో ఈ ఏడాది జనవరిలో మండలిని రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. మండలి తీరుతో ప్రభుత్వ నిర్ణయాలు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. తాజాగా ఈ విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కారణం కొంచెం ఓపిక పడితే మండలి కూడా వైసీపీ వశం కావడం ఖాయం. మరో ఏడు నెలల్లో శాసనమండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో చాలావరకు ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లే ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా కొత్త ఎమ్మెల్సీ స్థానాలన్నీ అధికారపార్టీ చేజిక్కించుకోవడం ఖాయం. దీంతో పెద్దలసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఈజీగా పాసవుతుంది.

తిరుపతి లోక్ సభస్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో దింవగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడం వెనుక ఇదే స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. రద్దు చేస్తామంటున్న మండలికి ఎంపీ కుమారుడ్ని ఎలా పంపుతారన్న విమర్శలు రావడంతో సీఎం జగన్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

శాసన మండలిలో చాలామంది పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికానుంది. మండలి అధ్యక్షుడు షరీఫ్ తో పాటు సంధ్యారాణి, తిప్పేస్వామి తో టు మరో 10 మంది పదవీ కాలం 2021 జూన్ నాటికి ముగుస్తుంది. వీటిలో ఎక్కువ సీట్లు ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటాకు చెందినవే ఉన్నాయి. సీఎం జగన్ మరో ఏడు నెలలు ఓపిక పడితే మండలిలో వైసీపీ మెజిరిటీ సాధిస్తుంది. ఇక ప్రభుత్వ నిర్ణయాలకు గతంలో మాదిరి బ్రేకులు పడే ఛాన్సే ఉండదు. మరోవైపు పార్టీలో పలువురు ముఖ్యనేతలకు పదవులిస్తానన్న హామీలను సీఎం నిలబెట్టుకునే అవకాశముంది. ఇప్పటికే అనేక మందికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇస్తానని మాటిచ్చారు జగన్ మోహన్ రెడ్డి. తాజాగా దివంగత ఎంపీ కుమారుడు కల్యాణ చక్రవర్తికి కూడా ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. పండుల రవీంద్రబాబు, జకియా ఖానుమ్, డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు ఇటీవలే ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఒకవేళ మండలి రద్దయితే వీరికి పదవులు ఉండవు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావొచ్చు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం ఎదురుచూడాల్సిందే..!

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.