వయసు పెరిగితే సరిపోదు… బుద్ధి పెరగాలి – జగన్

CM Jagan sensational comments on AP Assembly

ఏపీ అసెంబ్లీ రెండోరోజు ప్రారంభంలోనే సభ అట్టుడికింది. జీరో వడ్డీ రుణాలపై చర్చ కొనసాగించాలని టీడీపీ పట్టుబట్టింది. ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. నిన్ననే ముగిసిన అంశంపై చర్చ కొనసాగించలేమన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని చర్చకు అనుమతించాలని… వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు లేవనెత్తిన అంశంపై జగన్ తిరిగి సమాధానం ఇస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుపడ్డారు. దాంతో జగన్ ఒక దశలో తీవ్రంగా స్పందించారు.

బుద్ది జ్ఞానం లేకుండా వ్యవహరించవద్దని టీడీపీ ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. చంద్రబాబును ఉద్దేశించి కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడేవాడు ఎవడూ లేరిక్కడ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. బుద్ది జ్ఞానం లేకుండా వ్యవహరించే మీరు ఎలా ఎమ్మెల్యేలు అయ్యారని ప్రశ్నించారు. వయసు పెరిగితే సరిపోదు… బుద్ధి పెరగాలి … అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ తరహాలోనే గొడవ చేస్తే 23 మంది సభలో కూడా కూర్చోలేరని జగన్ హెచ్చరించారు.

చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు తమ పార్టీ ఎమ్మెల్యేలు మౌనంగా కూర్చున్నారని… కానీ ముఖ్యమంత్రిగా తాను సమాధానం ఇస్తుంటే మాత్రం పదేపదే అడ్డుపడడం ఏం సంస్కారం అని నిలదీశారు. ఇదే తరహాలో మేం వ్యవహరించి ఉంటే చంద్రబాబు సభలో మాట్లాడి ఉండేవారా? అని ప్రశ్నించారు. మొత్తం రౌడీలను, గూండాలను తయారు చేసుకుని టీడీపీ వాళ్లు అసెంబ్లీకి వచ్చారని జగన్ మండిపడ్డారు.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.