గంగుల ప్రభాకర్ రెడ్డికి సీఎం కీలక పదవి

CM YS Jagan key post to Gangula prabhakar reddy

ఏపీలో పదవులను నియామకాలను జరుపుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.కంచుకోట కర్నూలు జిల్లాకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరో కీలక పదవి ఇచ్చారు అనే చెప్పాలి. పార్టీకి నిబద్దుడిగా పనిచేస్తున్న నేతలకు జగన్ కీలక పదవులు ఇస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఇదే దారిలో శాసన మండలి ప్రభుత్వ విప్ పదవి ఆళ్లగడ్డకు చెందిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ కేబినెట్ హోదా, ప్రొటోకాల్ ఉన్న పదవి తమ నాయకుడికి ఇవ్వడం పట్ల గంగుల వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో రెండు ఎంపీ, 11 ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన వైసీపీ, ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా నుంచి ఒక్కరు కూడా తెలుగుదేశం నేతలు గెలవలేదు. అందుకే జగన్ కర్నూలు జిల్లాలో పార్టీ తరపున కష్టపడిన ప్రతీ నేతకు న్యాయం చేస్తున్నారు.

ఇక జిల్లాలో మంత్రి వర్గ కూర్పులో కూడా కీలక పదవులు వచ్చాయి వైసీపీ ఎమ్మెల్యేలకు. ఇప్పటికే డోన్ ఎమ్మెల్యే బుగ్గనకు ఆర్థిక, శాసన సభ వ్యవహారల మంత్రి పదవి, ఆలూరు ఎమ్మెల్యే జయరాంకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా గంగుల ప్రభాకర్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం పట్ల జిల్లా వైసీపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగుల కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. గంగుల తిమ్మారెడ్డి 1967, 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన వారసుడు గంగుల ప్రతాప్ రెడ్డి 1984, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ముందు నుంచి జిల్లాలో గంగుల కుటుంబానికి ఎంతో ప్రాధ్యాన్యత ఇస్తూనే ఉన్నారు రాజకీయంగా, ఇటు అన్నీ పార్టీలు వారి రాకని ఎప్పుడూ కోరుకునేవి. కాంగ్రెస్ లో వారి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉండేది.

1991 ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన. నాటి ప్రధాని పీవీ నరసింహరావు కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు. తిమ్మారెడ్డి రెండో తనయుడైన గంగుల ప్రభాకర్రెడ్డి 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఇక ఆయనకు జగన్ ముందు నుంచి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన తనయుడు బిజేంద్రరెడ్డికి ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చారు జగన్ అక్కడ నుంచి మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియ నిలబడ్డారు కాని అక్కడ బిజేంద్ర రెడ్డి నాని గెలుపొందారు.. తనయుడు ఎమ్మెల్యే తండ్రి ఎమ్మెల్సీగా ఉన్నారు..తాజాగా గంగుల ప్రభాకర్రెడ్డికి శాసనమండలి ప్రభుత్వ విప్ పదవి దక్కింది.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.