janampulse

నగరి వైసీపీ గ్రూప్‌ వార్‌! స్పందించిన డిప్యూటీ సీఎం

Roja

నగరి వివాదంపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తను డిప్యూటీ సీఎంనని.

Also Read జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు.

ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉందన్నారాయన. సత్యవేడు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌తో పాటు స్థలాన్ని పరిశీలించాను అని తెలిపారు నారాయణ స్వామి. కాగా, డిప్యూటీ సీఎం పర్యటనతో నగరి నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు రాజుకుందనే ప్రచారం సాగింది.

స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించడం వివాదానికి కారణమైంది. నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కలిసి నగరి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అయితే ఈ సమావేశం పై ఎమ్మెల్యే రోజాకి కానీ, అనుచరులకు కానీ ఎలాంటి సమాచారం లేదంటున్నారు.  

ఈ సమీక్షకు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా కూడా హాజరయ్యారు. ఈ పర్యటనపై రోజా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మొత్తానికి వివాదం రాజుకోవడంతో.. వివరణ ఇచ్చి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎవ్వడు? అనుచరులు.

నగరి, పుత్తూరులో అందరూ నా అనుచరులేనని… రోజా నా సోదరివంటివారని.. కలిసి పనిచేస్తున్నాం.. కానీ, ఎక్కడా గ్రూపులకు అవకాశం లేదన్నారు నారాయణస్వామి. అయితే ఇదే విషయంపై అటు మంత్రి నారాయణ స్వామి కూడా స్పందించారు. తాను పుత్తూరులో పర్యటించేందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుమతి అవసరంలేదని మీడియాతో మంత్రి నారాయణస్వామి చెప్పారు.

రోజా పర్మిషన్‌ తీసుకోవడానికి తాము ఆమెకు వ్యతిరేకంగా మీటింగ్‌ పెట్టలేదన్నారు. గిరిజన యువజన సంఘాన్ని 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. మా సంఘం తరపున అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశామని మంత్రి నారాయణస్వామి అన్నారు. అక్కడ కల్యాణ మండపం నిర్మించాలనుకున్నామని, దీంతో కలెక్టర్‌ తిరుపతికి వెళ్తూ పుత్తూరు వచ్చి స్థలాన్ని పరిశీలించారని నారాయణస్వామి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గొడవ కాస్త వైసీపీ అధిష్టానం వరకు వెళ్లడంతో.. పార్టీ పెద్దలు కలుగజేసుకొని వివాదానికి కాస్త పుల్ స్టాప్ పెట్టినట్లు సమాచారం.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.