తెలుగుమీడియంలో దేవాన్ష్ ? నారా ఫ్యామిలీ నిర్ణయమా?

తెలుగుదేశం నేతలు చాలా మంది జగన్ తెలుగుని చంపేస్తున్నాడు అని నానా హంగామా చేస్తున్నారు. అయితే తెలుగు వారిని తెలుగులో చదువుకోనివ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిషు మీడియంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జగన్ పై విమర్శలు చేసే పచ్చ పత్రికలు మీడియాలు నోళ్లు -కలాలు తెరిచాయి.

అయితే ఇలా గొంతు చించుకునే నేతల అందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారా ? తెలుగుమీడియంలో చదువుతున్నారా? అంటే అందరూ ఇంగ్లీష మీడియంలోనే చదువుతున్నారు .. కాని రాష్ట్రం విషయంలో పేద పిల్లల విషయంలో మాత్రం ఆ పిల్లలు తెలుగుమీడియంలో చదువుకోవాలట. అయితే ప్రైవేట్ స్కూల్లలో చదువుకుని అమెరికా లాంటి దేశాలకు చాలా మంది వెళ్లిపోతుంటే, సర్కారి బడుల్లో తెలుగుమీడియం చదివి జిల్లా దాటని వారు లక్షల మంది ఉన్నారు. ఇలా అంటే వారందరూ సరిగ్గా చదువుకోలేదా అంటే ,మంచి మార్కులతో పాస్ అయ్యారు కాని ఇంగ్లీష్ లో మాత్రం వీక్ అవుతున్నారు. బేస్ నుంచి ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉంటే వారికంటే మంచి మార్కులు అవకాశాలు పొందుతారు.

దీనినే జగన్ సర్కారు గుర్తించింది. ఇప్పటి నుంచి మార్పు తీసుకువస్తే పది సంవత్సరాలలో మొత్తం సర్కారీ బడులు కూడా అన్నీ ఇంగ్లీష్ మీడియం అవుతాయి అని ఆలోచించారు..తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న లోకేశ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నేత విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా సాక్షిగా ఆయన లోకేశ్ అండ్ కోపై విరుచుకుపడ్డారు. లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తారా? అంటూ సూటి ప్రశ్న వేశారు. దీంతో దెబ్బకు టీడీపీ సేన అంతా సైలెంట్ అయింది, గొంతుచించుకుంటున్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేల పిల్లలు లక్షల రూపాయల డొనేషన్లు కట్టి ఇంగ్లీష్ బడులకి పంపిస్తున్నారు. అదే పేద పిల్లలు మాత్రం సర్కారు బడిలో ఇంగ్లీష్ లో చదువుకోకూడదా, నిజంగా చంద్రబాబు అన్నింటికి ఓ రోల్ మోడల్ అని చెబుతారు.. ఇప్పుడు కూడా దేవాన్ష్ ని మంగళగిరి లేదా కుప్పంలో ప్రభుత్వ స్కూల్లో చేర్పించి తెలుగు మీడియంలో చేర్పిస్తే స్టేట్ లో ప్రజలు అందరూ కూడా అదే ఫాలో అవుతారు అంటున్నారు వైసీపీ నేతలు. ఇకనైనా బాబుగారు ఈ విషయం పై తమ సైనికులకు సరిగ్గా మాట్లాడాలి అని ప్రకటన చేస్తే బాగుంటుంది అని పేద ప్రజలు కోరుకుంటున్నారట.

Latest Updates

More...

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.