janampulse

ఢిల్లీలో దారుణం ఇలా అయితే క‌రోనా ఆగ‌దు

delhi corona daily wage workers in border

విదేశాల నుంచి వ‌చ్చిన వారు ఇళ్ల‌ల్లో బాగానే ఉన్నారు.. వీరి నుంచి వ‌చ్చిన వ్యాధి ఏకంగా పేద చిరు వ్యాపారాలు చిన్న కూలీప‌ని చేసుకునే వారిని ఇబ్బందిలో పెట్టేసింది అంటున్నారు జ‌నం, వారికి ప‌నిలేక ఇబ్బందులు ప‌డుతున్నారు, పేద‌వాడే ఇప్పుడు అత్యంత దారుణ‌స్దితికి చేరుకున్నాడు.

దేశం అంతా లాక్ డౌన్ లో ఉంది, అయితే ఢిల్లీ బస్ స్టేషన్ దగ్గర సన్నివేశం చూస్తే మ‌తిపోతుంది. ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన వలసదారులు వేల మంది ఇక్క‌డ‌కు చేరుకున్నారు. రెండు నెలల పాటు కాదు కదా 15 రోజులు కూడా వాళ్ళు పని లేకుండా, ఆదాయం లేకుండా బతకలేరు. ఇంటికి వెళితే ఎలాగైనా బ‌త‌క‌చ్చు అని యూపీ వెళ్లేందుకు ప‌య‌నం అయ్యారు.

నోయిడా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిలిచిపోయిన తమ వాళ్లను సొంతూళ్లకు తీసుకెళ్లడం కోసం 1000 బస్సులను పంపుతున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. డీటీసీ కూడా 200 బస్సులను ఏర్పాటు చేసింది. అందుకే ఈ స్థాయిలో జనం బస్ టెర్మినల్‌కు చేరుకున్నారు. ఇలా వేల మంది వ‌స్తే ఎవ‌రికి అయినా క‌రోనా ఉంటే వారి ప‌రిస్దితి ఏమిటి ప్ర‌భుత్వాలు ఏం ఆలోచ‌న చేస్తున్నాయి, అక్క‌డ ఉన్న‌వారు అంద‌రికి ఉచితంగా భోజ‌నం పెట్టి వారిని అక్క‌డే క‌ట్ట‌డి చేయాలి క‌దా అని మేధావి వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.