
ఆ మహిళల రుణాలన్నీ మాఫీ.. జగన్ ఆదేశాలు…AP సర్కార్ కీలక నిర్ణయం
వరద ప్రభావిత ప్రాంతాలైన రాజమంపేట మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న మహిళలకు సంబంధించిన రుణాలను మాఫీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వాయుగుండం ప్రభావానికి రాయలసీమ అతలాకుతలమైంది. అనూహ్య వరదలతో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఆ ప్రాంత మహిళల రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రాజంపేట మండలంలోని ఆరుగ్రామాలకు చెందిన బాధిత మహిళల ఎస్‌హెచ్‌జీ రుణాలు, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల్లోని లోన్స్ మాఫీ చేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.8.98 కోట్ల రుణాలు మాఫీ చేయనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజంపేట మండలంలోని గుండ్లూరు, మందపల్లి, పులపుత్తూరు, ఆర్.బుడుగుంటపల్లి, శేషాంబపురం, తాళ్లపాక రెవెన్యూ గ్రామాల మహిళలకు ఈ మాఫీ వర్తిస్తుందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వలు జారీ చేశారు. ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలోని 31 నివాస ప్రాంతల్లో ఉన్న డ్వాక్రా మహిళలు 291 సంఘాల పేరిట వివిధ బ్యాంకులు, మరో 573 మంది డ్వాక్రా మమిళలు వ్యక్తిగతంగా స్త్రీ నిధి సంస్థ ద్వారా నవంబర్ నెలాఖరు నాటికి రూ.8,98,14,058 రుణం పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల వరద బాధితుల పరామర్శకు సీఎం జగన్ వెళ్లిన సమయంలో ఆయా గ్రామాల మహిళలు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని కోరడంతో.. సీఎం ఆదేశాల మేరకు వన్‌టైం చర్యగా ఆ రుణం మొత్తం మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్