
ఇంటిలో లక్ష్మి దేవి నిలవలంటే..అవి ఏమిటో తెలుసుకోండి
మనిషికి దాన గుణం ఉండాలని మన పెద్దవారు చెప్పుతారు.ఈ విధంగా సాయం చేయటం వలన మన కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తాం. ఈ కలియుగంలో మానవుడు కష్టాల నుండి విముక్తి పొందాలంటే పూజలు,దానాలు తప్పనిసరి. అందువల్ల మనకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయటం మరియు పూజ పునస్కారాలు చేయటం మంచిది. ఈ విధంగా దానాలు చేయటం మంచిదే కానీ కొన్ని వస్తువులను దానం చేయకూడదు. ఆలా దానం చేస్తే అనేక నష్టాలు కలుగుతాయి. అంతేకాక ఆ వస్తువులను దానం చేయటం వలన లక్ష్మి దేవి ఇంటిలో స్థిరంగా ఉండక వెళ్ళిపోతుంది. లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటే సమస్య ఏదైనా బయట పడవచ్చు. కాబట్టి మనకు కష్టాలు, నష్టాలు రాకుండా ఉండాలంటే ఏ వస్తువులను దానం చేయకూడదో తెలుసుకుందాం.
పాడైన అన్నం,వస్తువులను దానం చేయకూడదు. ఒక వేళ వాటిని దానంగా ఇస్తే అనవసర కోర్టు కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే డబ్బులు నిలవవు.
పదునుగా ఉండే వస్తువులను ఎట్టి పరిస్థితిలోను దానం ఇవ్వకూడదు. ఒక వేళ వాటిని దానంగా ఇస్తే మానసిక కల్లోలం ఏర్పడుతుంది. అంతేకాక దురదృష్టం కూడా వెంటాడుతుంది. చీపురు దానం ఇస్తే ఇంటిలో లక్ష్మి దేవి నిలవదు. ఎంత ఆదా చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా ఖర్చు అయ్యిపోతుంది. విరిగి పోయిన వస్తువులు,చిరిగిపోయిన బట్టలు దానం ఇవ్వకూడదు. ఒక వేళ వాటిని దానంగా ఇస్తే చేసే పనులు కలిసి తావని అంటారు. ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వకూడదు. ఒక వేళ వాటిని దానంగా ఇస్తే కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందువల్ల దానం చేయాలనీ భావించినప్పుడు ఈ వస్తువులు లేకుండా చూసుకోండి. లేకపోతె ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్